Begin typing your search above and press return to search.

పవన్ సీఎం కావాలి: వైసీపీ మంత్రి

By:  Tupaki Desk   |   24 Jun 2023 3:00 PM GMT
పవన్ సీఎం కావాలి: వైసీపీ మంత్రి
X
ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గతకొన్ని రోజులుగా వారాహి యాత్ర సభల్లో పవన్ చేస్తున్న వ్యాఖ్యలు మరింత హీట్ పెంచుతున్నాయి. దీంతో వైసీపీ వర్సెస్ జనసేన రాజకీయాలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. ఈ సమయంలో పవన్ ముఖ్యమంత్రి అవ్వాలని తనకూ ఉందని సంచలన కామెంట్లు చేశారు ఏపీ మంత్రి.

అవును... పవన్ కల్యాణ్ కు ఎంత వరకూ ఉందనే సంగతి కాసేపు పక్కనపెడితే... పవన్ అభిమానులు, జనసైనికులు మాత్రం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని బలంగా కోరుకుంటున్న సంగతి తెలిసిందే! ఈ సమయం లో తన అభిమానులు, కార్యకర్తలతో పాటు పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి అవ్వాలని తాను కూడా కోరుకుంటున్నట్లు ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు.

తాజాగా తిరుమల లో స్పందించిన ఆయన... రాష్ట్రంలో ఎవరైనా యాత్రలు, పాదయాత్రలు చేసుకోవచ్చని అన్నారు. అయితే, సీఎం కావాలంటే మాత్రం దానికి ఒక లెక్క ఉంటుందని వివరించారు. ఇందులో భాగంగా పవన్ 175 స్థానాల్లోనూ పోటీచేసి కనీసం 88 స్థానాల్లో గెలుపొందితే ముఖ్యమంత్రి అవ్వొచ్చు... లేదా 100 స్థానాల్లో పోటీచేసి కనీసం 50 స్థానాల్లో గెలుపొంది బేరాలాడి అయినా ముఖ్యమంత్రి అవ్వొచ్చు.. ప్రజాస్వామ్యంలో ఈ రెండు ఆప్షన్సే ఉన్నాయని మంత్రి తెలిపారు.

అనంతరం.. "ఈ విషయాల ను పరిగణ లోకి తీసుకుని పవన్ 175 స్థానాల్లో పోటీ చేసినా, 100 స్థానాల్లో పోటీచేసినా ముఖ్యమంత్రి కావాలి.. ప్రజాస్వామ్యంలో ప్రజలచేత ఎన్నికోబడాలన్నదే మా కోరిక" అంటూ ముగించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

అయితే... పవన్ 175 స్థానాల్లోనూ పోటీచేయకపోవచ్చు, పొత్తులో భాగంగా అయితే 100స్థానాల్లో పోటీచేయడానికి కూడా ఛాన్స్ ఉండదు అంటూ వస్తోన్న కథనాల నేపథ్యంలో... ఈ రెండు రీతుల్లోనూ పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు లేవని మంత్రి పరోక్షంగా తెలిపినట్టు అర్థం అవుతున్నదని అంటున్నారు విశ్లేషకులు.