Begin typing your search above and press return to search.

వారాహీ ట్రైలర్ అక్కడ....సినిమా ఎక్కడ...?

By:  Tupaki Desk   |   11 March 2023 9:20 AM GMT
వారాహీ ట్రైలర్ అక్కడ....సినిమా ఎక్కడ...?
X
వారాహీ ఈ పేరు ఇపుడు ఏపీ రాజకీయాలకు బాగా తెలిసిపోయింది. అత్యంత శక్తివంతమైన అమ్మవారే వారాహీ. ఆ పేరుని తన రధానికి పెట్టుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన వారాహీ రధానికి జనవరి 24లో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద పూజలు చేయించారు. ఆ తరువాత విజయవాడ తీసుకుని వచ్చి శ్రీ దుర్గా అమ్మవారికి పూజలు చేయించారు. అంతటితో ఆ వారాహి పరుగు ఆగిపోయింది.

అదిగిఓ ఇదిగో అంటూ వారాహితో పవన్ బస్సు యాత్ర మార్చిలో కూడా లేదని తేలిపోయింది. అయితే ఈ నెలలో 14న జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభకు ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి. అయిదు లక్షల మంది జనాలు సభకు వస్తారని అంటున్నారు.

వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని సొంత నియోజకవర్గం మచిలీపట్నంలో జనసేన పదవ ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభ కోసం పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల ముందే ఏపీకి చేరుకుంటున్నారు. ఆయన మంగళగిరి పార్టీ ఆఫీసులో రెండు రోజులు విడిది చేయనున్నారు. తొలి రోజు బీసీలతో రౌండ్ టేబిల్ సమావేశాన్ని నిర్వహిస్తాఉర్.

ఆ తరువాత 12న ఆయన కాపు సేన నాయకులతో మీటింగ్ పెడతారు. 13న ఏపీ రాష్ట్ర నూతన గవర్నర్ నజీర్ ని మర్యాదపూర్వకంగా కలుస్తారని పార్టీ వర్గాలు తెలియచేశాయి. అదే విధంగా 14న మంగళగిరి పార్టీ ఆఫీసు నుంచి పవన్ కళ్యాణ్ మచిలీపట్నానికి వెళ్తారు.

అయితే ఈసారి పవన్ కార్లతో కాన్వాయ్ గా వెళ్ళడంలేదు. వారాహీ వాహనం ద్వారా ఆయన మచిలీపట్నం చేరుకుంటారు. అంటే ఏపీలో పవన్ వారాహీ ద్వారా జరిపే తొలి పర్యటన ఇదే అవుతుంది అన్న మాట. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి క్రిష్ణా జిల్లాలోని మచిలీపట్నం దాకా వారాహి రధం ప్రయాణిస్తుంది. ఈ రధం వెళ్ళే మార్గాన్ని రూట్ మ్యాప్ ని అంతా సిద్ధం చేసి ఓకే చేశారు. ఈ రధం పైన వస్తున్న పవన్ని చూసేందుకు అభిమానులు ఈ ప్రాంతంలో ఉత్సహాం చూపించడం ఖాయం.

ఆ విధంగా పవన్ కళ్యాణ్ వారాహీ రధంతో జనంలోకి వెళ్ళే ప్రోగ్రాం ని ఆవిర్భావ సభతో ట్రైయల్ గా రిలీజ్ చేస్తారన్న మాట. మరి పూర్తి స్థాయిలో పవన్ జనంలోకి వచ్చి వారాహి రధం ఎక్కేది ఎపుడు అంటే ఆ డేట్ టైం ఇప్పటికి ఇంకా ఫిక్స్ కాలేదు. వారాహి రధం మీద ఏపీ అంతా తిరుగుతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు.

అయితే ఆవిర్భావ సభకు మాత్రం ఆయన నాలుగు రోజులు కేటాయించడం విశేషం. దీని తరువాత మళ్లీ ఆయన షూటింగులో బిజీ అవుతారనే అంటున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే పవన్ వారాహి రధం ఏపీలో అడుగు పెట్టేది ఉండొచ్చని అంటున్నారు. అంట్టే అసలైన సినిమా అపుడు చూపిస్తారు అన్న మాట. అంతవరకూ ఈ ట్రైలర్ ని చూసి సంతృప్తి చెందాల్సిందే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.