Begin typing your search above and press return to search.

లోక కళ్యాణం కోసం పవన్ సాహసం

By:  Tupaki Desk   |   1 July 2020 3:30 PM GMT
లోక కళ్యాణం కోసం పవన్ సాహసం
X
లోకకళ్యాణం కోసం తన స్టార్ ఇమేజ్ ను పక్కనపెట్టి.. అన్నింటిని త్యజిస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హీరోలు, రాజకీయ నేతలు కూడా సాహసించని కఠినమైన ‘చాతుర్మాస్య దీక్ష’కు ఈరోజు దిగారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సమాజ సంక్షేమాన్ని, లక్షలాది మంది చిరు వ్యాపారుల ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోవాలని ఆకాంక్షిస్తూ ఆయన ఈ చాతుర్మాస్య దీక్షను చేపట్టారు.

ఈ దీక్ష నేడు బుధవారం తొలి ఏకాదశ నాడు ప్రారంభించి కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశితో ముగుస్తుంది. ఆ తర్వాత హోమం నిర్వహించి దీన్ని విరమిస్తారు. నాలుగు నెలలపాటు కఠినమైన ఈ దీక్షను పవన్ చేయబోతున్నారు.

ఈ దీక్షలో కఠినమైన నిబంధనలుంటాయి. సాత్వికాహారాన్ని స్వీకరించాలి. అంటే మితంగా ఆహారం తినాలి. పాలు, పండ్లు ఒక్కపూట మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం బంద్ చేయాలి.. రాత్రి శాకాహారంతో దీక్షను ముగించాలి. చండీహోమంతో ఈ దీక్ష కార్తీక మాసంలో ఏకాదశితో ముగుస్తుంది.

కరోనానుంచి దేశం బయటపడడానికే పవన్ కళ్యాణ్ దీక్షను చేపట్టారని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలను ఆర్థికంగా మానసికంగా పీడిస్తున్న ఈ వైరస్ వల్ల ఉపాధి పోయి లక్షలాది మంది రోడ్డున పడ్డారని.. అందుకే పవన్ వారికి తిరిగి పూర్వ స్థితికి వచ్చేందుకు అమ్మవారిని వేడుకుంటారని తెలిపారు.