Begin typing your search above and press return to search.

కేడ‌ర్ కోస‌మే జ‌న‌సేనాని త‌ప‌నంతా.. అంతేనా!?

By:  Tupaki Desk   |   28 Jun 2023 9:23 AM GMT
కేడ‌ర్ కోస‌మే జ‌న‌సేనాని త‌ప‌నంతా.. అంతేనా!?
X
ఏ పార్టీకైనా కేడ‌ర్ అత్యంత కీల‌కం. నాయ‌కులు చేసే ప‌ని ఎలా ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో దానిని ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేది.. క్షేత్ర‌స్థాయి లో అమ‌లు చేసేది కూడా కేడ‌రే. ఈ కేడ‌ర్ బ‌లంగా ఉంటే.. పార్టీ మ‌నుగ‌డ సాధ్య‌మ‌వుతుంది. ఇక్క‌డ ఏమా త్రం తేడా వ‌చ్చినా.. క‌ష్ట‌మే. అందుకే.. వైసీపీ అధినేత త‌ర‌చుగా.. కేడ‌ర్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. దీనిని గ‌మ‌నించిన జ‌న‌సేన అధినేత కూడా ఇప్పుడు కేడ‌ర్‌ను సంతృప్తి ప‌రిచే చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

అందుకే.. ఆయ‌న వారాహి యాత్ర‌ల్లో త‌రచుగా తానే సీఎంన‌ని ప్ర‌క‌టిస్తున్నారు. వాస్త‌వానికి ప‌వ‌న్ సీఎం అవుతారా? లేదా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తులు ఉంటాయ‌ని ప‌వ‌నే చెబుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో వారాహి యాత్ర పూర్తి చేసుకున్న స‌మ‌యంలోనూ ఆయ‌న ఇక్క‌డ ద్వారం పూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిని ఓడించేందుకు త‌మ వంతు స‌హ‌కారం అందిస్తామ‌ని చెప్పారు.

అదేవిధంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో వైసీపీని విముక్తం చేసేందుకు కృషి చేస్తామ‌న్నారు. త‌ప్ప‌.. ఎక్క‌డా ద్వారం పూడిపై జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్థినినిల‌బెడ‌తామ‌ని కానీ.. లేదా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని 30కిపైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని కానీ.. ఆయ‌న చెప్ప‌లేదు.

ఎందుకంటే.. పొత్తుల్లో భాగంగా నాలుగైదు సీట్లలోనే జ‌న‌సేన ఇక్క‌డ పోటీకి రెడీ అవుతుంద‌నే చ‌ర్చ ఉంది. అయితే.. ప‌వ‌న్ మాత్రం ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం వెనుక కేడ‌ర్‌ను సంతృప్తి ప‌ర‌చ‌డ‌మే క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఎందుకంటే.. తాను సీఎం కావాల‌ని ప‌వ‌న్ ఉన్నా లేకున్నా.. కేడ‌ర్ మాత్రం బ‌లంగా కోరుకుంటోంది. 2014, 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలోనే కేడ‌ర్‌.. ఆయ‌న‌ను సీఎంగా ఊహించుకుంది. ఇప్ప‌టికీ యువ‌త సీఎంసీఎం అంటూ.. ప‌వ‌న్ విష‌యంలో జ‌పం చేస్తూనే ఉన్నారు.

ఇలాంటి స‌మ‌యంలోఅనూహ్యంగా పొత్తుల విష‌యాన్ని ప్ర‌స్తావించి.. దానిని బ‌లంగా నొక్కి చెబితే.. సీఎం సీటు విష‌యంలో కేడ‌ర్ అసంతృప్తి వ్య‌క్తం చేసే అవ‌కాశం ఉంద‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. అందుకే చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.