Begin typing your search above and press return to search.

పవన్ కు జడ్ ప్లస్ ఇవ్వాల్సిందే.. బట్ హౌ ?

By:  Tupaki Desk   |   20 Jun 2023 1:02 PM GMT
పవన్ కు జడ్ ప్లస్ ఇవ్వాల్సిందే.. బట్ హౌ ?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే అని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విచిత్రం ఏమిటంటే పవన్ బీజేపీ మిత్రపక్షం. పవన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేసింది కూడా బీజేపీ నేతే. అధికారం లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. అయినా మిత్రపక్షం అధినేత పవన్ సెక్యూరిటి విషయం లో ఇంత అయోమయం ఎందుకో అర్దంకావటంలేదు.

మామూలుగా ప్రభుత్వాల ను డిమాండ్ చేసేది ప్రతిపక్షాల నేతలే కానీ అదికార పార్టీ నేతలు కాదు. ప్రతిపక్షాల నేతలు డిమాండ్ చేస్తుంటారు. అధికార పార్టీ నేతలు చర్యలు తీసుకుంటుంటారు. కానీ ఇక్కడ రివర్సులో అధికార బీజేపీ నేతలే డిమాండ్ చేస్తున్నారు.

తన కు సెక్యూరిటి పెంచమని పవన్ అయితే ఎక్కడా డిమాండ్ చేయలేదు. తనకున్న వై క్యాటగిరి భద్రత ను గతం లో టీడీపీ హయాంలోనే తొలగించినట్లు పవన్ చేసిన వ్యాఖ్యలు వైరలయ్యాయి. అప్పటి పరిస్దితిని బట్టి టీడీపీ ప్రభుత్వం తొలగిస్తే తొలగించుడచ్చు.

కానీ తాజా పరిస్దితి లో పవన్ భద్రతకు ప్రభుత్వం గట్టి చర్యలనే తీసుకుంది. ప్రభుత్వపరంగా భద్రత ను ఇవ్వటమే కాకుండా వ్యక్తిగతంగా పవన్ కూడా బౌన్సలర్లను ఏర్పాటుచేసుకున్నారు. ఇవన్నీ సరిపోదన్నట్లుగా ఇపుడు కొత్తగా పవన్ కు భద్రత కల్పించాలనే డిమాండ్లు మొదలయ్యాయి. నిజానికి పవన్ కు జడ్ ప్లస్ భద్రత కల్పించేందుకు నిబంధనలు అంగీకరించవు. ఎందుకంటే పవన్ అధికారపదవుల్లో లేరు. ఒక సిని సెలబ్రిటీ+రాజకీయ పార్టీ అధినేత మాత్రమే.

రాజకీయ పార్టీ అధినేత హోదా కారణం గానే ప్రభుత్వం పవన్ కు భద్రత కల్పించింది. ఇక జడ్, జడ్ ప్లస్ సెక్యూరిటీ అంటే కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకోవాల్సిందే. అందుకనే నిబంధనలు అంగీకరించవు.

ఎందుకంటే పవన్ ప్రాణాల కు ఎలాంటి ముప్పులేదు. ముప్పుందని కనీసం ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా లేవు. కాబట్టి నిబంధనల ప్రకారం జడ్, జడ్ ప్లస్ సెక్యూరిటీ సాధ్యమయ్యే పని కాదు. అయితే ప్రభుత్వం తలచుకుంటే ఏదైనా సాధ్యమే. కాబట్టి బీజేపీ నేతలు గట్టిగా డిమాండ్లు చేసి పట్టుబడితే జడ్ క్యాటగిరీ భద్రత ఇస్తుందేమో చూడాలి.