Begin typing your search above and press return to search.

ఒంటరైన పవన్...రాజకీయమంటే ఇదే...?

By:  Tupaki Desk   |   11 July 2023 2:26 PM GMT
ఒంటరైన పవన్...రాజకీయమంటే ఇదే...?
X
పవన్ కళ్యాణ్ దూకుడు పాలిటిక్స్ కి ఒక్కసారిగా చెక్ పడినట్లు అయింది. ఇంతకాలం తాను ఏది మాట్లాడినా రైట్ అనుకుంటూ సాగిన ఆయన స్పీడ్ కి బ్రేకులు పడ్డాయి. ఏపీ లో అతి పెద్ద వ్యవస్థగా ఉన్న వాలంటీర్ల మీద పవన్ చేసిన బేస్ లెస్ ఆరోపణల తో ఆయన ఇరుకునపడ్డారు. ఆయన కు ఆ సమాచారం కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చాయని అంటున్నారు.

కానీ తెర వెనక వారు ఎవరో అనవసరం. ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న అధినేతగా పవన్ తాను చేసిన కామెంట్స్ కి ఆయనే బాధ్యత వహించాలి. పవన్ కి స్క్రిప్ట్ టీడీపీ నుంచి టీడీపీ అనుకూలమీడియా నుంచి వస్తోంది అని వైసీపీ ఆరోపణలు చేయవచ్చు. ఎవరు ఇచ్చినా లేక తాను సమాచారం సేకరించుకున్నా లేక కేంద్రంలోని నిఘా వర్గాలు చెవి లో చెప్పినా ఇపుడు జనం ముందు ఉన్నది పవన్ మాత్రమే.

ఆయన వాలంటీర్ల మీద చేసిన దారుణమైన ఆరోపణల మీద రాజకీయాల కు అతీతంగా సర్వత్వా విమర్శలు వస్తున్నాయి. మేధావి వర్గం నుంచి కూడా నిరసనలు వస్తున్నాయి. ఒక కొత్త వ్యవస్థ ఏపీ లో రూపుదాల్చింది. అది సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అంత మాత్రాన వాలంటీర్ల వ్యవస్థలో లోపాలు లేవు అని కావు. వారి విషయంలో ఏమి చేయాలో విధానపరంగా పవన్ మాట్లాడి ఉంటే బాగుండేది.

కానీ ఆయన బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. సంఘ వ్యతిరేక శక్తులతో లింక్ పెట్టి మరీ వాలంటీర్లను కార్నర్ చేశారు. అదే ఇపుడు ఆయన కు బిగ్ ట్రబుల్ ఇస్తోంది. పవన్ ఏపీలో కూటమి కట్టాలని అనుకుంటున్నారు. ఆయనకు కేంద్రం లో అధికారం చేస్తున్న బీజేపీ తో పొత్తు ఉంది. మిత్ర పక్షం నేత ఇంతలా ఇరకాటంలో పడితే దాన్ని ఏదో విధంగా సర్దుబాటు చేసేలా నైతికంగా అయిన సపోర్ట్ ఉండేలా బీజేపీ నుంచి ఏదైనా రావాలి. కానీ బీజేపీ ఫుల్ సైలెంట్ గా ఉంది.

దానికి కారణం జనసేన బీజేపీ పొత్తు అన్న మాటే కానీ రెండు పార్టీలు ఎక్కడా కలసి చేసిన పోరాటాలు కార్యక్రమాలు లేవు పవన్ కూడా తన సభల లో బీజేపీ పేరు ఎత్తడంలేదు. దాంతో ఆయన బాధ ఆయన రాజకీయం మనకెందుకు అన్నదే ఇపుడు బీజేపీ వారికి ఉందేమో తెలియదు. అంతే కాదు ఏపీ లో వాలంటీర్ల వ్యవస్థ మీద పవన్ చేసిన కామెంట్స్ ని సమర్ధిస్తే తాము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్న ఆలోచన ఉందేమో తెలియదు కానీ బీజేపీ నుంచి సౌండ్ లేదు.

ఇక తెలుగుదేశం పార్టీ విషయం తీసుకుంటే పవన్ తో పొత్తు పెట్టుకుంటారు అన్నంతలా బంధం ఉంది. అయితే పవన్ ఇపుడు తన రాజకీయ జీవితం లో ఎన్నడూ లేనంత ఇబ్బందుల్లో ఉంటే టీడీపీ నుంచి ఒక్క సమర్ధింపు మాట రావడంలేదు. పవన్ని పట్టుకుని ఎందుకు అలా టార్గెట్ చేస్తున్నారు అని వైసీపీ మీద ఏదో ఒక విషయం లో అయినా విరుచుకుపడే టీడీపీ నోట ఇపుడు మాట రావడంలేదు.

దానికి కారణం. వాలంటీర్లు పవన్ కామెంట్స్ పట్ల గుర్రుగా ఉన్నారు. దాంతో కోరి ఎందుకు వ్యతిరేకత తెచ్చుకోవడం అన్న ముందు జాగ్రత్త ఉండడమే అంటున్నారు. మొత్తానికి చూస్తే పవన్ కామెంట్స్ ఇంటా బయటా అగ్గి పుట్టిస్తున్నాయి. వరసగా రెండవ రోజు కూడా వాలంటీర్లు రోడ్డెక్కారు. వారి ఆందోళన కొనసాగుతోంది.

ఈ ఇష్యూలో పవన్ మాటలే ఆయన కు ఇబ్బంది తెచ్చాయని అంటున్నారు. సినీ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజా లాంటి వారు కూడా పవన్ దే తప్పు అని మాట్లాడుతున్నారు. పవన్ వాలంటీర్ల మీద చేసిన కామెంట్స్ నీచమైనవి అని కూడా అన్నారు. ఆయన ఇలా మాట్లాడుతారు అని తాను అసలు ఊహించలేదు అన్నారు.

మొత్తానికి చూస్తే తానున్న సినీ రంగం నుంచి కూడా మద్దతు రావడంలేదు అన్నదే పవన్ విషయం లో జరుగుతోంది. తొలి దశ వారాహి యాత్ర కు వచ్చిన ఊపుని రెండవ దశలో కంటిన్యూ చేయాలన్న ఉత్సాహం లో ఉన్న పవన్ కి ఆదిలోనే ఇలాంటి ఇబ్బంది ఎదురైంది. అదే సమయం లో రాజకీయంగా తాను ఒంటరిని అని తెలిసివచ్చిందా అన్న చర్చ నడుస్తోంది.