Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌కు టెన్ష‌న్ పెంచేసిన సోము వీర్రాజు.. రీజ‌న్ ఇదే

By:  Tupaki Desk   |   29 March 2022 1:30 AM GMT
ప‌వ‌న్‌కు టెన్ష‌న్ పెంచేసిన సోము వీర్రాజు.. రీజ‌న్ ఇదే
X
బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి నిర్వ‌హించిన ఓపెన్ హార్ట్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప‌లు అంశాల‌ను వెల్ల‌డించారు. ముఖ్యంగా ప్ర‌స్తుతం త‌మ‌తో క‌లిసి ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఇటీవ‌ల జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ‌లో కీల‌క ప్ర‌శ్న సంధించారు. బీజేపీ రోడ్ మ్యాప్‌ను బ‌ట్టి.. త‌మ భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక ఉంటుంద‌న్నారు. ఈ విష‌యంపై తాజాగా సోము వీర్రాజు రియాక్ట్ అయ్యారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోరిన‌ట్టు బీజేపీ హైక‌మాండ్ రోడ్ మ్యాప్ ఇస్తుంద‌ని చెప్పారు. అయితే.. దీనికి తొంద‌ర ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు.

``రోడ్ మ్యాప్ విష‌యంలో బీజేపీ హైక‌మాండ్ స్పందిస్తుంది. అయితే.. ఈ ఇష‌యంలో రాష్ట్ర బీజేపీకి ఎలాంటి తొంద‌రా లేదు. కానీ, పార్టీని క్షేత్ర‌స్థౄయిలో బ‌ల‌పేతం చేసేందుకు మేం ప్రాధాన్యం ఇస్తాం`` అని సోము చెప్పారు. అంతేకాదు.. ఈ ఏడాది చివ‌రి నాటికి పార్టీని బ‌లోపేతం చేయ‌డం పై దృష్టి పెడ‌తామ‌న్నారు. ఆ త‌ర్వాత‌.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి.. నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఆయ‌న చెప్పారు. అంతేకాదు.. బీజేపీ గురించి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చింతించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

అంతేకాదు.. ఎన్నిక‌ల‌కు ఇంకా 16 మాసాల‌కు పైగానే స‌మ‌యం ఉంద‌ని.. అప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని. ఆయ‌న చ‌క్క‌గా పాలించుకోవ‌చ్చ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా సోము మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలో బీజేపీకి అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయ‌ని అనుకుంటే.. జ‌గ‌న్ దూకుడుకు అడ్డుక‌ట్ట వేస్తుంద‌ని.. ఒక‌వేళ బీజేపీకి అవ‌కాశాలు లేవ‌ని భావిస్తే.. ఆయ‌న జోలికి వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌ద‌న్నారు.

ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీకి ఆశించిన బ‌లం క్షేత్ర‌స్తాయిలో లేదు. కాబ‌ట్టి మేం పుంజుకునే ప‌నిలో ఉన్నాం. కానీ, జ‌న‌సేన అలా కాదు. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు వేచి ఉండే ప‌రిస్థితి లేద‌న్న‌ట్టుగా ఉంద‌ని.. సోము వీర్రాజు చెప్పారు. బీజేపీ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. జ‌న‌సేన‌కు ఏపీలో కొంత బ‌లం ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని చెప్పారు.

అదేస‌య‌మంలో జ‌న‌సేన గురించి కూడా సోము ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని.. అన్నారు. అధికారంలోకి వ‌చ్చేందుకు జ‌న‌సేన ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని.. ఒక‌వేళ అలా కుద‌ర‌క‌పోతే.. అధికారంలోకి వ‌చ్చేందుకు ఏదొ ఒక పార్టీకి వెన్నుద‌న్నుగా ఆపా ర్టీ మార‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. అయితే.. బీజేపీ ఇలా చేస్తుంద‌ని అనుకోవ‌డం లేద‌న్నారు. బీజేపీ మాదిరిగా జ‌న‌సేన చూస్తూ ఉండ‌బోద‌న్నారు.

మ‌రో ప్ర‌శ్న‌కు సోము జ‌వాబు ఇస్తూ.. జ‌గ‌న్ ను నిలువ‌రించే క్ర‌మంలో టీడీపీ అధికారంలోకి రావ‌డాన్ని తాము కోరుకోవ‌డం లేద‌న్నారు. ``మా ప్రాధాన్యం వేరు. జ‌గ‌న్‌ను నిలువ‌రించాల్సిందే. అలాగ‌ని.. చంద్ర‌బాబును అధికారంలోకి తీసుకురావ‌డో.. ఆయ‌న స‌ర్కారు ఏర్పాటు చేయ‌డ‌మో.. మా అభిమ‌తం కాదు`` అని వెల్ల‌డించారు.

అంటే.. దీనిని బ‌ట్టి.. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌నేది.. బీజేపీ త‌క్ష‌ణ వ్యూహంగా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చేఎన్నిక్ల‌లో తాము అధికారంలోకి రావాల‌ని మాత్ర‌మే బీజేపీకి ఉంది. ఒక వేళ ఇది కుద‌ర‌ని ప‌క్షంలో వైసీపీ కొన‌సాగినా.. అభ్యంత‌రం లేద‌న్న‌ట్టుగా సోము వెల్ల‌డించారు. ఈ ప‌రిణామాలు.. స‌హ‌జంగానే జ‌న‌సేన‌కు ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ కు ఇబ్బందిగానే మారుతున్నాయి. ఎందుకంటే.. వైసీపీ కొమ్ములు విరిచేస్తాం.. అంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించారు. కానీ... జ‌న‌సేన‌తో పొత్తు ఉన్న బీజేపీ మాత్రం త‌న వైఖ‌రిని స్ప‌ష్టంగా పేర్కొంటోంది.

ఈ ప‌రిణామ‌మే నిజ‌మైతే.. అంటే.. బీజేపీ పుంజుకుని అధికారంలోకి వ‌స్తే.. రావాలి. లేకుంటే.. వైసీపీ అధికారంలో ఉండాల‌నే సిద్ధాంతం విష‌యంలో ప‌వ‌న్‌.. త‌న వ్యూహం ఎలా మార్చుకుంటార‌నేది ఇంపార్టెంట్‌గా మారింది. ఒక‌వేళ‌.. ఆయ‌న ప్ర‌భుత్వాన్ని మార్చాల‌ని అనుకుంటే.. బీజేపీతో ఇక ఎక్కువ కాలం క‌లిసి ఉండ‌కుండా.. త‌న దారి తాను చూసుకోవ‌డం మంచిద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి.