Begin typing your search above and press return to search.

పవన్ తాజా డిమాండ్.. సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలి

By:  Tupaki Desk   |   17 Feb 2023 10:42 AM GMT
పవన్ తాజా డిమాండ్.. సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలి
X
తాజాగా వెలుగు చేసిన దారుణ ఉదంతంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ రియాక్టు అయ్యారు. చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ అడిగితే ఇవ్వని అధికారులతో.. చివరకు చేసేదేమీ లేక టూ వీలర్ మీద 120 కి.మీ. మేర ప్రయాణించిన వైనం బయటకు రావటం..దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. ఈ ఉదంతంపై పవన్ కల్యాణ్ స్పందించారు. జగన్ సర్కారును తీవ్రంగా తప్పు పట్టారు.

ఆసుపత్రులను మెరుగుపర్చని వైసీపీ పెద్దలు విశాఖను రాజధానిగా డెవలప్ చేస్తారట.. బిడ్డ మృతదేహంతో 120 కిలోమీటర్ల దూరం మోటార్ సైకిల్‌పై వెళ్లిన ఆ గిరిజన దంపతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

కేజీహెచ్ లో గిరిజనులకు సాయం అందించేందుకు ఎస్టీ సెల్ ఉన్నా .. ఆసుపత్రిలో ఉన్నతాధికారులు ఉన్నా పట్టించుకోకపోవటమా? అంటూ ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వ పని తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.

మహాప్రస్థానం వాహనాల నిర్వహణ మాత్రమే కాదు అంబులెన్సుల నిర్వహణ కూడా సరిగా లేదన్న పవన్ కల్యాణ్.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అంబులెన్సుల్ని అందుబాటులోకి తెచ్చినట్లుగా పేర్కొంటూ విజయవాడ బెంజ్ సర్కిల్ లో భారీగా అంబులెన్సుల్ని జెండా ఊపి ప్రారంభించటం.. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని డ్రోన్ విజువల్స్ తీయించి.. షార్ట్ వీడియోగా ప్రభుత్వం చేసుకున్న ప్రచారం అంతా ఇంతా కాదు.

ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ ప్రస్తావిస్తూ.. ''బెంజి సర్కిల్ లో అంబులెన్సులు నిలబెట్టి డ్రోన్ విజువల్స్ తీసి జెండా ఊపితే ప్రయోజనం ఉండదు. వైద్య ఆరోగ్య శాఖకు రూ.14 వేల కోట్లు బడ్జెట్ ఇచ్చామని చెబితే సరిపోదు. ప్రజలకు సేవలు అందాలి. ఆసుపత్రుల్లో కనీస వసతులు మెరుగుపడాలి'' అని పేర్కొన్నారు.

పాలకులు తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విశాఖను రాజధానిగా డెవలప్ చేస్తామని చెబుతున్నారని.. మాయ మాటలతో ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాకు చెందిన జంట తమ బిడ్డ డెడ్ బాడీని అంబులెన్సులో తరలించే స్థోమత లేకపోవటం.. అధికారులు అంబులెన్స్ ను ఏర్పాటు చేయకపోవటంతో.. చేసేదేమీ లేక స్కూటీ మీద పాడేరు వరకు తీసుకెళ్లిన వైనం సంచలనంగా మారటంతో పాటు.. జగన్ సర్కారు తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్న వైనం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.