Begin typing your search above and press return to search.

తెలుగు రాని ముఖ్యమంత్రి... ఈ ర్యాగింగ్ ఎవరిదంటే...?

By:  Tupaki Desk   |   28 Jun 2023 11:13 PM GMT
తెలుగు రాని ముఖ్యమంత్రి... ఈ ర్యాగింగ్ ఎవరిదంటే...?
X
జగన్ లో ఒక కీలక పాయింట్ ని పట్టుకుని మైనస్ గా జనసేన చూపుతోంది. జగన్ కి తెలుగు రాదు అన్నది ఆ ఆరోపణ. నిజానికి ఇలాంటి ఆరోపణ గతం లో ఉమ్మడి ఏపీ చివరి సీఎం గా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మీద వచ్చింది. ఆయన కూడా తెలుగు ఒత్తి పలుకుతూ ఉండేవారు.

ఇపుడు జగన్ విషయం లో అదే ఆరోపణ ను జనసేన చేస్తోంది. జగన్ కి తెలుగు రాదు అంటోంది. పవన్ కళ్యాణ్ అయితే ఇది తెలుగు రాష్ట్రానికి చాలా దురదృష్టకరం అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ కి చిన్నపుడు వత్తులు పొల్లులూ దీర్ఘాలు నేర్పలేదని, అందువల్లనే ఈ సమస్య అని అంటున్నారు. తెలుగు సరిగ్గా రాని నియంత కంఠకుడు పాలన లో ఉన్నందుకు చింతిస్తున్నాని అని పవన్ తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

జనసేన పార్టీ అధికారం లోకి వస్తే ఒక వయోజన పాఠశాల ను పెట్టి మరీ జగన్ కి తెలుగు ఎలా మాట్లాడాలో పాఠాలు నేర్పిస్తామని పవన్ అనడం విశేషం. అది కూడా తానే నేర్పిస్తాను అని పవన్ అనడమే ట్విస్ట్. వైసీపీ నాయకుల కు జనసేన చేత తిట్టించుకోవడం అలవాటు. లేకపోతే వారికి నిద్ర పట్టదు అని పవన్ ఘాటు కామెంట్స్ చేస్తారు. నేను మంగళగిరి లో చెప్పు చూపించాను అంటే దాని వెనక చాలా కధ జరిగింది అని ఆయన చెప్పారు.

వైసీపీ నేతలు భయపెడితే భయపడాల్సిన పని లేదని పవన్ అన్నారు. ఎదురుతిరిగితేనే మార్పు అన్నది వస్తుందని ఆయన పార్టీ క్యాడర్ కి దిశా నిర్దేశం చేశారు. ప్రతీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల గుత్తాధిపత్యం పెరిగిపోతోంది అని పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ని ఉద్దేశిస్తూ ఆయన ఈ మాటలు అన్నారు.

చక్కగా కస్తూరిబా పేరు పాఠశాల కు ఉంటే దాన్ని తీసేసి తన తండ్రి పేరు పెట్టుకోవడం ఏమి న్యాయమని ప్రశ్నించారు. అన్ని విషయాల మీద కూడా ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోతోంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ధోరణిని మార్చాలని కూడా ఆయన పిలుపు ఇచ్చారు.

ఈసారి ఎన్నికల్లో వైసీపీ గోదావరి జిల్లాల లో ఒక్క సీటు కూడా గెలవకూడదని పవన్ సూచించారు. ఏపీ లో వైసీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాల ని ఆయన స్పష్టం చేశారు. అలా జరిగితేనే రాష్ట్రం బాగుపడుతుంది, జనాలు బాగుపడతారు అని ఆయన అంటున్నారు.

ఈసారి భీమవరం లో కూడా జనసేన జెండా ఎగరవేస్తుంది అని పవన్ కళ్యాణ్ చెప్పడం విశేషం. జనసేన తరఫున 2019లో పవన్ పోటీ చేశారు. ఈసారి మళ్ళీ ఆయన చేస్తారో లేక ఏవరిని అయినా నిలబెడతారో తెలియదు కానీ గెలుపు తమ పార్టీదే అంటున్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్ సీఎం జగన్ మీద వైసీపీ మీద చేసిన విమర్శలు మాత్రం హాట్ టాపిక్ గా మారుతున్నాయి.