Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ ఏమైనా దేవుడా...?

By:  Tupaki Desk   |   13 Jun 2023 1:01 PM GMT
పవన్ కళ్యాణ్ ఏమైనా దేవుడా...?
X
పవన్ కళ్యాణ్ జోస్యాలు చెబుతున్నారా లేక కేంద్ర ఎన్నికల సంఘం హోదాను తీసుకుని అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తున్నారా లేక తానే దేవుడిగా మారి సత్యాలు వల్లిస్తున్నారా అన్నది అర్ధం కావడంలేదు అంటున్నారు. లేకపోతే ఆయన తెలంగాణాతో పాటుగానే ఏపీలో ఎన్నికలు వస్తాయని చెప్పేస్తున్నారు.

చెప్పేయడమే కాదు పక్కాగా డిక్లేర్ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలు ఉంటాయని ఆయన కడు ధీమాగా చెబుతున్నారు. అసలు పవన్ అలా ఎందుకు చెబుతున్నారు అన్నదే ఇక్కడ చర్చ. నిజానికి ఏపీలో ముందస్తు ఎన్నికల మీద టీడీపీ అనుకూల మీడియావే రచ్చ చేసింది. దానిని ఎప్పటికపుడు జగన్ సహా వైసీపీ నేతలు ఖండిస్తూనే ఉన్నారు.

అయితే పదే పదే అదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇంతకాలం టీడీపీ ముందస్తు అంటూ మాట్లాడేది. ఇపుడు పవన్ నోట ఆ మాట వస్తోంది. యాగం మంగళగిరి జనసేన ఆఫీసులో జరుగుతున్న వేళ పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నారు. తెలంగాణా నుంచి వచ్చిన కొంతమంది నేతలకు ఆయన పార్టీ బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణాతో ఏపీకి కూడా ఎన్నికలు వస్తాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. పవన్ కి ముందస్తు ఎన్నికలు ఏపీలో వస్తాయన్నది ఎలా తెలిసింది అని అంతా అడుగుతున్నారు. ఆయన డిక్లేర్ చేయడానికి ఈసీ కాదు కదా అంటున్నారు. చంద్రబాబే పవన్ తో అలా చెప్పించి ఉంటారని కూడా అంటున్నారు.

ఏపీలో ముందస్తు ఎన్నికలు ఎందుకు అని పవన్ చెప్పారు అంటే దాని వెనక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. అదేలా అంటే ఆయన వారాహి వాహనం ఏపీలో సందడి చేయబోతోంది. దాంతో పవన్ యాత్రకు జనాలు పెద్ద ఎత్తున రావాల్సి ఉంటుంది. అదే టైం లో ఎన్నికల వేడి పుడితేనే జనాలు కూడా వస్తారు. లేకపోతే అది కాస్తా జనసైనికుల ప్రోగ్రాం గా మారిపోతుంది అని అంటున్నారు.

నిజానికి ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని షెడ్ నుంచి బయటకు తీసారని అంటున్నారు. అయితే జగన్ ముందస్తు ఎన్నికలు లేవు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని మంత్రివర్గ సమావేశం సందర్భంగా మంత్రులకు చెప్పారు. ఒక విధంగా క్లారిటీ ఇచ్చేశారు.

దాంతో విపక్షాలు డీలా పడ్డాయి. అప్పటికే జనసేన వారాహి రధయాత్ర డిక్లేర్ అయిపోయింది. దాంతో ఇపుడు అదే మాటను అంటూ జనాలకు చెబుతూ పవన్ ముందస్తు మంత్రాన్ని వల్లిస్తున్నారు అని అంటున్నారు. కాకపోతే ఇక్కడ జనసేన రధయాత్ర ప్లాన్ కూడా జాగ్రత్తగానే ఉంది అంటున్నారు. మొదటి విడత రెండవ విడత అంటూ వారాహి రధయాత్రను డిజైన్ చేస్తున్నారు.

అంటే మొదటి విడతను చేసిన తరువాత కొన్నాళ్ళూ గ్యాప్ ఇచ్చి రెండవ విడత చేసుకుంటూ వస్తారు అన్న మాట. ఇదంతా అధికార విపక్షాల మధ్య ఎత్తుకు పై ఎత్తు వ్యవహారంగా సాగుతోంది. ముందస్తు ఎన్నికలు అంటూ ముందుగానే వారాహి యాత్రకు పవన్ వచ్చాక తాపీగా లేదు అని వైసీపీ చెప్పేసింది. దాంతో అటు సినిమాలు ఇటు రాజకీయాల మధ్య పవన్ ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు.

దాంతో ముందస్తు ఎన్నికలు ఏపీలో తప్పకుండా ఉంటాయని చెబుతున్నారు అని అంటున్నారు. అయితే అలా చెప్పడానికి పవన్ కళ్యాణ్ బ్రహ్మం గారు కాదు కదా అని సెటైర్లు పడుతున్నాయి. మరో వైపు చూస్తే ఇవన్నీ చిన్న పిల్లల చేష్టలుగా కూడా విమర్శలు వస్తున్నాయి. ఆరాటం ఉండొచ్చు కానీ అనుకున్నపుడే ఎన్నికలు రావల్సిన అవసరం అయితే ఉందా అన్నదే చర్చగా ఉంది.

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ముందస్తు ఎన్నికలు అంటూ ఏపీలో వేడి రాజేస్తున్నారా లేక జనసైనికులలో వేడి పుట్టిస్తున్నారా అన్నది కూడా ప్రశ్నగా ఉంది. రాజకీయాల్లో ఉనంపుడు హుందాగా ప్రకటనలు ఇవ్వాలి. అలాగే ఇచ్చిన స్టేట్మెంట్స్ లో మెచ్యూరిటీ ఉండాలి. జనాలు ప్రతీ దాన్ని గమనిస్తారు. కాలిక్యులేట్ చేస్తారు. కానీ పవన్ మాత్రం ఏ రకంగానూ బేస్ లేకుండా ముందస్తు ఎన్నికలు అంటున్నారు. నేను చెబుతున్నారు కదా అని అంటున్నారు. మరి పవన్ చెబితే ఏపీలో ఎన్నికలు వచ్చేస్తాయా ఆయన కోరుకున్నపుడు ఎన్నికల నగరా మోగిస్తారా.

విపక్షాలకు ఎపుడు ఎన్నికలు పెడతారా అని ఉంటుంది. కానీ అధికార పార్టీకి తొందర ఏముంటుంది. ఈసీ కూడా నిబంధనల ప్రకారం నడచుకుంటుంది. అయినా హడావుడి చేస్తూ పవన్ పలుచన అవుతున్నారు అని అంటున్నారు. ఎన్నికల విషయంలోనే ఇంత గందరగోళంగా మాట్లాడుతున్న జనసేనాని ముందు ముందు ఎలా మాట్లాడుతారో అని కూడా అంతా చర్చించుకుంటున్నారు.