Begin typing your search above and press return to search.
వైసీపీకి బీజేపీ అండ నిజం...మిత్రపక్షానికి సేనాని షాక్ ...?
By: Tupaki Desk | 15 Jun 2023 1:05 AM GMTబీజేపీ ఏ రోజునా వైసీపీకి అండగా లేదు అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియా ముందు ప్రకటించిన వెంటనే ఆ పార్టీ మిత్రపక్షం అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ వైసీపీకి అన్నింటా అండగా నిలుస్తోంది అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసి ట్రబుల్స్ లోకి నెట్టేశారు.
కత్తిపూడి సభలో వారాహి రధం మీద నుంచి మాట్లాడిన పవన్ కళ్యాణ్ వైసీపీకి బీజేపీ మద్దతు లేకపోతే కేంద్రం ఎందుకు ఇన్ని నిధులను ఆ వైసీపీ ప్రభుత్వానికి ఇస్తుందని ప్రశ్నించారు. బీజేపీకి వైసీపీ మద్దతుగా నిలబడింది కూడా నిజం. అలాగే వైసీపీకి బీజేపీ అండగా ఉందంటూ ఆ పార్టీ గాలి తీసేశారు. వారి మాటలలో సారం ఏంటో చెప్పేశారు.
నిన్న కాక మొన్న అమిత్ షా ఏపీ టూర్ కి వచ్చి వైసీపీ మీద నిప్పులు చెరిగి వెళ్లారు. ఆయనతో పాటు జేపీ నడ్డా కూడా వైసీపీని విమర్శించారు. ఇక ఏపీ బీజేపీ నేతలు అయితే వైసీపీ తప్పులను తాము మొదటి నుంచి ఎండగడుతున్నామని చెప్పుకొచ్చారు. దీంతో ఏపీలో వైసీపీ నుంచి బీజేపీ దూరం జరిగిందని అంతా అనుకున్నారు.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీకి బీజేపీ అండగానే ఉంటోదని ఒక పరమ సత్యాన్ని చెప్పి మిత్ర పక్షాన్ని ఇరకాటంలో పెట్టేశారు. వైసీపీ మీద బీజేపీ పోరాడుతోంది అని చెబుతున్న దాన్ని పక్కన పెడుతూ అసలైన పోరాటం జనసేన మాత్రమే చేస్తోందని చెప్పి బీజేపీకి బిగ్ ట్రబుల్స్ క్రియేట్ చేశారు.
ఒక్క చాన్స్ జనసేనకే ఇవ్వాలని ఆయన కోరడం కూడా విశేషం. అందులో పొత్తులూలేవు, మిత్రులు లేరు, మీ పవన్ కళ్యాణ్ కి అని మాత్రమే ఆయన చెప్పుకున్నారు. నేను అవినీతి చేయను, పైసా కూడా ముట్టను, నా మీద ఎలాంటి కేసులు లేవు, కేంద్ర నాయకుల అడుగులకు మడుగులు ఒత్తను, ఎవరికీ భయపడను అంటూ పవన్ గట్టిగా చెప్పుకున్నారు.
నన్ను గెలిపిస్తే ఏపీ తలరాత మారుస్తాను అని పవన్ క్లారిటీగా ప్రకటించారు. మరి పవన్ మనసులో ఏముంది అన్నదే ఇక్కడ అంతు పట్టడంలేదు. జనసేనను గెలిపిస్తే ఏపీకి భవిష్యత్తు అని పవన్ అంటున్నారు. మీ భవిష్యత్తుకు మా గ్యారంటీ అని ఒక వైపు టీడీపీ చెబుతున్న వేళ జనసేన మధ్యలో వచ్చి ఒక్క చాన్స్ ఇవ్వండి అని కోరడం చూస్తే ఏపీలో పొత్తుల కధ ఎటు తిరుగుతోంది అన్నదే అర్ధం కావడంలేదు అంటున్నారు.
ఇక బీజేపీ ఇటీవల వైసీపీ కి దూరం జరిగినట్లుగా చెప్పుకోవాలని ఆరాటపడుతోంది. అయితే ఆ రెండు పార్టీలు నిన్నటిదాకా ఒక్కటే అన్నట్లుగా పవన్ మాట్లాడడం ద్వారా మిత్ర పక్షానికీ షాక్ ఇచ్చేశారు. ఇంకో విషయం ఏంటి అంటే వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్న మాట ఈసారి ఆయన నోట రాకపోవడం. చూడబోతే పవన్ వారాహి రధయాత్ర కొత్త సంకేతాలనే ఇచ్చేలా ఉంది అని అంటున్నారు.