Begin typing your search above and press return to search.
కొన్నిసార్లు హింస తప్పదంటున్న పవన్
By: Tupaki Desk | 14 April 2018 8:31 AM GMTజమ్మూ కాశ్మీర్ లో కథువాలో ముక్కు పచ్చలారని బాలికపై మానవ మృగాలు చేసిన అత్యాచారం, హత్య ఉదంతం దేశవ్యాప్తంగా రెండు రోజులుగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై రాజకీయ పార్టీలతో పాటుగా మహిళా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ సంచలన సంఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన మహిళా విభాగం 'వీర మహిళా' ప్రతినిధులు, విద్యార్థులు, యువతీయువకులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కథువా ఘటన హృదయాన్ని ద్రవింపచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారులు, ఏ ఆసరా లేని మహిళలు, ఉద్యోగాలు చేసుకోనే ఆడబిడ్డలకు రక్షణ లేని పరిస్థితులు వచ్చాయి అన్నారు. ఆడపిల్లల జోలికి వెళ్తే బహిరంగంగా తోలు తీయాలన్నారు.
అహింసా పరమో ధర్మః అనే మాట ఈ సందర్భంలో కుదరదని, మహిళల్ని కాపాడుకొనేందుకు హింస తప్పదని పవన్ కళ్యాణ్ తెలిపారు. "కథువా ఘటన మొదటిది కాదు. మన వ్యవస్థలో ఓ దుర్ఘటన జరిగితే గానీ చలనం రాదు. నిర్భయ చట్టం కూడా ఢిల్లీలో అత్యాచార ఘటన జరిగిన తరవాతే వచ్చింది. ఢిల్లీ తమ కళ్ల ముందు జరిగితేనే ఎంపీలు స్పందిస్తారా? ఆడ పిల్లల్ని వేధించే ఈవ్ టీజర్లు, అత్యాచారానికి ఒడిగట్టేవాళ్ళని బహిరంగంగా శిక్షించాలి. సింగపూర్ తరహాలో బెత్తం పట్టుకొనే శిక్షలు రావాలి. ఈ మధ్యనే సుప్రీం కోర్టు న్యాయమూర్తి మర్మాంగాలు కోసేయాలి అన్నారు. ఆడ పిల్లల జోలికి వెళ్ళేవాళ్ళని బహిరంగంగా శిక్షిస్తే అందరిలో భయం పుడుతుంది`` అని పవన్ కళ్యాణ్ అన్నారు. `సినిమాల ప్రభావంతో మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు పెరిగాయి అంటారు... కథువాలో చిన్నారిపై అత్యాచారం, హత్యకి సినిమాలు, కళలు ప్రేరేపించాయా? మనిషిలో పశువాంఛతో జరుగుతున్నాయి. పశువుకైనా ప్రకృతి నియమం ఉంటుందేమో.. అలాంటి మానవ మృగాలకి ఏమి ఉండటం లేదు.` అంటూ తన రంగాన్ని రక్షించేందుకు ప్రయత్నించారు.
ఓ తమ్ముడిగా, ఓ అన్నగా ఆడపిల్లలు బయటకి వెళ్తే వేధింపుల నుంచి రక్షించుకోవడం ఎంత కష్టమో తనకు తెలుసని పవన్ అన్నారు. `ఆడపిల్లలు బయటకి వెళ్తే తిరిగి వచ్చే వరకూ ఇంట్లో కన్నవాళ్ళు భయపడే పరిస్థితులు వచ్చాయి. కొన్నేళ్ల కిందట ఓ షూటింగ్ వెళ్తే 200 మంది యూనిట్ సభ్యులు ఉండగానే కొంతమంది బయటివాళ్ళు చేరి సినిమాకి సంబంధించిన ఆడపిల్లల్ని వేధించారు. వాళ్ళ నుంచి కాపాడేందుకు నేను కర్ర పట్టుకోవాల్సి వచ్చింది. 2004 లో ఎన్.జి.ఓ. నిర్వాహకురాలు సునీతా కృష్ణన్ గారు కలిసి యువతులపై జరుగుతున్న దాడులు, అకృత్యాలని వివరించారు. నా సహాయం అందించాను. జనసేన తరఫున కథువా ఘటనని ఖండిస్తూ ఈ రోజు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద మౌన ప్రదర్శన చేస్తాం. జనసేన పక్షాన ఆడపిల్లల్ని రక్షించుకొనేందుకు కఠినమైన శిక్షలు పడేలా చట్టాలు చేయాలనీ డిమాండ్ చేస్తున్నాం. చట్టం బలహీనుల విషయంలో బలంగా, బలవంతుల విషయంలో బలహీనంగా పని చేస్తోంది. ఈ విధానంలో మార్పు వచ్చేలా పోరాడతాం. ప్రసార మాధ్యమాలు ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నప్పడు సంచలనాత్మకంగా కాకుండా సామాజిక చైతన్యం వచ్చేలా ముందుకు వెళ్ళాలి` అని పవన్ సూచించారు.