Begin typing your search above and press return to search.
40 ఇయర్స్ పాలిట్రిక్స్.. దోచుకోవడానికేనా..
By: Tupaki Desk | 29 May 2018 8:12 AM GMTపవన్ కళ్యాన్ రూటు మార్చాడు.. మొన్నటివరకు సీఎం తనయుడు లోకేష్ ను టార్గెట్ చేసిన జనసేనాని పవన్.. ఈరోజు తండ్రి ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేసి పరుష వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాం - పాలకొండల్లో ప్రస్తుతం యాత్ర నిర్వహిస్తున్న పవన్.. ఉద్దానం బాధితులపై మొన్నటివరకు ఫైట్ చేశారు. దీక్ష చేశారు. దీనిపై అధికార టీడీపీ స్పందించకపోవడంతో ఇప్పుడు చంద్రబాబునే టార్గెట్ చేసి తాజాగా విమర్శలు గుప్పించారు..
‘‘రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే అభివృద్ధి ఇదేనా.? ఆయన 40 ఏళ్ల అనుభవం కేవలం ఇసుక దోపిడీకి మాత్రమే ఉపయోగపడింది. ఒక్కో ఎమ్మెల్యే ఇసుక మాఫియా ద్వారా 30 కోట్లు కూడబెట్టారు. ఈ మాఫియా మొత్తాన్ని చంద్రబాబు పైనుంచి నడిపించారు’ అంటూ పవన్ కళ్యాన్ బాబు అవినీతిపై విరుచుకుపడ్డాడు..
శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు టీడీపీ గురించి రెండే మాటలు వినిపిస్తున్నాయని.. అవి భూకబ్జా - ఇసుక మాఫియా అని దుమ్మెత్తిపోశారు పవన్. ప్రభుత్వం సంపూర్ణంగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ‘గత ఎన్నికల్లో మీకు జనసేన మద్దతిస్తే మీరు చేసేది ఇదా.? ఇకపై చూస్తూ ఊరుకోం. మీ అవినీతిని సహించం. చొక్కా పట్టుకొని నిలదీస్తాం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడుచుపెట్టుకుపోతుంది..’ అంటూ పవన్ కల్యాణ్ టీడీపీకి హెచ్చరికలు పంపారు.
ఇక ప్రత్యేక హోదా గురించి కూడా పవన్ కళ్యాన్ స్పందించారు. చంద్రబాబు కాంట్రాక్టుల కోసం - కేసుల భయంతో రాజీపడడం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదన్నారు. ఆరోజు ప్రత్యేక హోదాకి కక్కుర్తిపడి కోట్ల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చేలా పవన్ చేశారని.. 40 ఏళ్ల అనుభవమంటే ఇదేనా అని ప్రశ్నించారు. కుర్చీపై ఆశలేదన్న పవన్ కళ్యాన్ మరోసారి తనను సీఎం చేయాలని ప్రజలను కోరడం విశేషంగా చెప్పవచ్చు.. ‘ఈసారి జనసేనను అధికారంలోకి తీసుకురండి.. నన్ను ముఖ్యమంత్రిని చేయండంటూ’ పవన్ పదేపదే ప్రజల్ని కోరడం ఆసక్తి రేపింది.