Begin typing your search above and press return to search.
ఇది ఏపీకి వరమా..? శాపమా..?
By: Tupaki Desk | 10 Aug 2015 4:57 AM GMTవిభజన నేపథ్యంలో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతే.. గత 14 నెలల కాలంలో బాబు పాలన పుణ్యమా అని.. కేంద్రం నుంచి అరకొర సాయంతో విభజన నాటి అప్పు కాస్తా కొండలా మారింది.
ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లకు 63 వేల కోట్ల అప్పు తేలితే.. గత 14 నెలల వ్యవధిలో రాష్ట్ర అప్పును రూ.80వేల కోట్లకు చేర్చిన ఘనత మాత్రం చంద్రబాబు నాయుడిదే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేకున్నా.. నోరు విప్పి నిజాలు చెప్పలేని దుస్థితిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండిపోయారు. మిత్రధర్మం పేరుతో నిశ్శబ్దంగా ఉన్న ఆయన తీరుతో.. కేంద్రం నుంచి రావాల్సిన సాయం అందని పరిస్థితి.
అందుకే.. నిధుల కోసం కేంద్రాన్ని అడిగే కన్నా.. ఎడాపెడా అప్పులు చేసేయటం.. బాండ్లు అమ్మేయటం లాంటివి చేస్తూ బాబు ముందుకెళుతున్నారు. మరోవైపు ఏపీకి ఎంతోకొంత మేలు చేస్తుందని భావించిన ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మోడీ సర్కారు సుముఖంగా లేరన్న విషయం తెలిసిందే. అయితే.. మోడీ సర్కారు వైఖరినిక నిదర్శనంగా తిరుపతికి చెందిన మునికోటి ఆత్మహత్యయత్నం.. చికిత్స పొందుతూ మరణించటం తెలిసిందే.
జరిగిన ఘటనపై..మునికోటి మరణం తర్వాత మాత్రమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.కోటి మృతి తనను తీవ్రంగా కదిలించి వేసిందన్న పవన్.. ప్రస్తుతం ఉన్న సున్నిత సమయంలో ప్రత్యేక హోదా గురించి తాను మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు.
నిజానికి ఇలాంటి ఘటనే కానీ.. తెలంగాణ సాధన కోసం జరిగి ఉంటే.. తెలంగాణ సమాజం భగ్గుమనేలా చేసే రాజకీయ పార్టీలు తెలంగాణలో ఉన్నాయి. కానీ.. ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పరిస్థితి ఉంది. కోటి మరణాన్ని రాజకీయం చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ.. ఆ పార్టీ వైఖరిని ఏపీలో ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు.
ఇక.. ఏపీ అధికారపక్షం మోడీతో యుద్ధం చేయటానికి ఏ మాత్రం సిద్ధంగా లేదన్న విషయం తెలిసిందే. ఇక.. మిగిలిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుందంటే.. దానికి ఉండే కారణాలు దానికి ఉన్నాయి. ఇక.. మిగిలింది పవన్ కల్యాణ్.. బాధతో.. ఆవేదనలో ఉన్న ప్రజల భావోద్వేగాలతో ఆటలు ఆడకూడదన్న ఉద్దేశంతో తాను ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదని.. సమయం చూసుకొని మాట్లాడతానని చెబుతున్నారు.
నిజానికి ఇలాంటి పరిస్థితి ఏపీకి వరమా? శాపమా? అన్నది ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్. కోటి మరణాన్ని ఏపీ సాధన కోసం ఓ పెద్ద ఉద్యమాన్ని తయారు చేసే వీలుంది. కానీ.. అదే జరిగితే అశాంతితో పాటు.. మరిన్ని బలవన్మరణాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఏపీలో అశాంతి తాండవం ఆడుతుంది. ఈ విషయాన్ని గుర్తించే పవన్.. ఇలాంటి పిలుపులకు కాస్త దూరంగా ఉన్నారని చెబుతున్నారు.
ఒకవిధంగా చూస్తే పవన్ వైఖరి ఏపీకి మంచిదే అన్నట్లుగా కనిపించినప్పటికీ.. దీర్ఘకాలం పాటు.. కేంద్రం నిర్లక్ష్యాన్ని చూస్తూ ఊరుకుంటే మాత్రం అంతిమంగా ఏపీకి భారీ అన్యాయం జరగటం ఖాయమని చెబుతున్నారు. మరి.. ఏపీ ప్రజల్లో ఎంతోకొంత నమ్మకం ఉన్న పవన్ కల్యాణ్.. ఏపీకి ప్రత్యేక హాదా విషయంలో ముంచుతారా? తేలుస్తారా? అన్నది కాలమే బదులివ్వాలేమో.