Begin typing your search above and press return to search.

రూ.200 కోట్ల ప్యాకేజీ వ‌దులుకున్న ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   12 Sep 2016 2:23 PM GMT
రూ.200 కోట్ల ప్యాకేజీ వ‌దులుకున్న ప‌వ‌న్‌
X
రాజ‌కీయ నాయ‌కులు - ఆమాటకొస్తే ఎరవ‌రైనా డ‌బ్బులు ఆఫ‌ర్ చేస్తే వ‌ద్దంటారా? నో అని చెప్పే ప్ర‌సక్తే లేదు. కానీ భిన్న‌మైన రాజ‌కీయవేత్త‌గా గుర్తింపు పొందిన‌ జ‌న‌సేన అధినేత - ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఇలాంటి ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించార‌ట. అదికూడా ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రెండు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌ను త‌న‌కు ఏ మాత్రం అక్క‌ర్లేద‌ని లైట్ తీసుకున్నార‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌ర్చ సాగుతోంది. అయితే ఇది లంచం రూపంలోనో మ‌రో ర‌కంగానో కాదట‌. పార్టీ బ‌లోపేతం కోసం ఫండ్ రూపంలో ఇస్తాన‌ని ఏపీకి చెందిన వ్యాపార‌వేత్త ఒక‌రు ఈ క్రేజీ ఆఫ‌ర్ పెట్టార‌ని తెలుస్తోంది.

సోష‌ల్ మీడియాలో - వివిధ వెబ్‌ సైట్లలోని ఆ గాసిప్ సారంశం ఏంటంటే...తిరుప‌తిలో మొద‌టి స‌భ‌ - కాకినాడ‌లో సీమాంధ్రుల ఆత్మ‌గౌర‌వ స‌భ పేరుతో తెర‌మీద‌కు వ‌చ్చిన ప‌వ‌న్ ఈ క్ర‌మంలో ఆంధ్రుల ఆకాంక్ష కోసం నిన‌దిస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా దుర‌దృష్ట‌వ‌శాత్తు కాకినాడ స‌భ‌కు హాజ‌రైన అభిమాని మ‌ర‌ణంతో తీవ్రంగా క‌ల‌త చెందిన ఆయ‌న కుటుంబానికి అండ‌గా నిలిచేందుకు ఆర్థిక స‌హాయం కూడా చేశారు. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయాల్లోకి ప‌వ‌న్ పూర్తిస్థాయిలో రావాల‌నుకుంటున్న ఆస‌క్తిని గ‌మ‌నించిన స‌ద‌రు ఆంధ్ర వ్యాపార‌వేత్త పార్టీని విస్త‌రించ‌డం - అభిమానుల్లో మ‌నోస్థైర్యం నింపేందుకు ఈ మొత్తాన్ని వాడుకోవాల‌ని సూచించార‌ట‌. అయితే ప‌వ‌న్ ఈ ప్ర‌తిపాద‌న‌ను క‌రాఖండిగా తిర‌స్క‌రించార‌ని చెప్తున్నారు. త‌ను సంపాదించిన దానితోనే పార్టీని న‌డుపుతాన‌ని, మెరుగైన రాజ‌కీయాల కోసం వ‌చ్చిన తాను వాటిని క‌లుషితం చేసేలా వ్య‌వ‌హ‌రించ‌బోన‌ని తేల్చిచెప్పిన‌ట్లు స‌మాచారం.