Begin typing your search above and press return to search.
జగన్ కు పవన్ మద్దతివ్వగలడా?
By: Tupaki Desk | 30 July 2017 4:19 PM GMT‘‘పవన్ కల్యాణ్ ఓ ఉదాత్త నాయకుడు. ఆయన కరడుగట్టిన రాజకీయ నాయకుల్లాగా చేసే ప్రతి పనితోనూ తనకు ప్రయోజనం ఉండాలని కోరుకునే రకం కాదు.. ప్రజల సమస్యలు పరిష్కారం కావడం ఒక్కటే తన లక్ష్యంగా పనిచేసే నాయకుడు....’’ ఇవీ ఇప్పటిదాకా జనంలో ఆయన గురించి చెలామణీలో ఉన్న అభిప్రాయాలు. ఇందులో అబద్ధం కూడా ఏమీ లేదు. తన నిబద్ధతను పవన్ కల్యాణ్ చాలా సార్లు నిరూపించుకున్నారు కూడా! తాజాగా ఆదివారం ఉద్ధానం బాధితులతో సమావేశం విషయంలో కూడా జగన్ ఇదే పోకడ చూపించారు. సమస్య పరిష్కారం అయితే చాలు.. తాను ఈ పోరాటానికి ప్రతిపక్ష నాయకుడు జగన్ మద్దతు కూడా కోరుతానని ఆయన చెప్పారు. అయితే ఇదే ప్రసంగంలో భాగంగా.. ‘‘జనావాసాల మధ్య మద్యం దుకాణాలు వద్దు’’ అంటూ ప్లకార్డును కూడా ప్రదర్శించి ఆ అంశంపై కూడా తన మనోగతాన్ని, పోరాటానికి సిద్ధంగా ఉన్న సంగతిని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అంతవరకు బాగానే ఉంది.
అయితే ఇక్కడే జనం మదిలో ఒక సందేహం మెదలుతోంది. ఉద్ధానం మీద తాను ఒక లార్జ్ స్కేల్ పోరాటాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్.. రాజకీయాలకు అతీతంగా చేద్దాం అంటూ జగన్ మద్దతు కూడా కోరుతా అని జనం వద్ద మార్కులు కొట్టేశారు. ఇప్పుడు ఆయన అందించిన పోరాట స్నేహ హస్తాన్ని అందుకోకుంటే.. అది జగన్ తప్పుగా ముద్రపడే ప్రమాదం కూడా ఉంది. పర్లేదు.. కానీ వైఎస్ జగన్ మద్యంపై తన పోరాటంపై ముందే క్లారిటీ ఇచ్చారు. దశలవారీ మద్యనిషేధం చేపడతానంటూ ప్రతిజ్ఞ చేశారు. మరి ఇప్పుడు మద్యనిషేధం విషయంలో పోరాడడంలో పవన్ కల్యాణ్ ది లేట్ ఎంట్రీ! ఆయనకు నిజంగా నిబద్ధతే ఉంటే గనుక... రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలు పరిష్కారం కావడం ఒక్కటే లక్ష్యం అనే మాట నిజమే అయితే గనుక... జగన్ ఇప్పటికే ప్రకటించిన మద్యనిషేధ ఉద్యమ పోరాటానికి తన మద్దతు తెలియజేసి.. అదే క్రమంలో ఉద్ధానం మీద తన పోరాటానికి జగన్ మద్దతును కూడా అడగవచ్చు కదా! ఏదో సభలో ప్రసంగంలో భాగంగా జగన్ ను కూడా కోరుతా అంటూ ఓ డైలాగు వేసేయడం కాదు.. ఆచరణలో ఇతరులతో కలసి పోరాడడంలో తన పటిమ కూడా ఏస్థాయిలో ఉంటుందో, ఇతరులు కూడా తాను పిలుపు ఇచ్చిన మంచి పనులకు ఆమేరకు స్పందిస్తే చాలునని పవన్ నిరూపించవచ్చు కదా.. అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది.
రాజకీయంగా ఆకర్షణీయమైన డైలాగులు.. ప్రత్యర్థులతో కలిసి అయినా ప్రజలకోసం పోరాడుతా లాంటి వాక్యాలు బాగానే ఉంటాయి. కానీ.. ఆచరణలోకి వచ్చేసరికి.. ‘తాను పిలవడం’ అయితే ఒక రకంగానూ ‘తాను కలవడం’ అయితే మరో రకంగానూ ఉంటాయి.. ఆ సంగతి పవన్ తెలుసుకోవాలి.