Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ సినిమా చేస్తున్నాడు..జ‌గ‌న్ పాల‌న అద్భుతం

By:  Tupaki Desk   |   2 Feb 2020 4:35 PM GMT
ప‌వ‌న్ సినిమా చేస్తున్నాడు..జ‌గ‌న్ పాల‌న అద్భుతం
X
జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి కొడాలి నాని సైటైర్లేశారు. జ‌గ‌న్ బాగా ప‌రిపాలిస్తే తాను వెళ్లి సినిమాలు చేసుకుంటాన‌ని గ‌తంలో ప‌వ‌న్ చెప్పాడ‌ని.. ఇప్పుడు అత‌ను సినిమాలు చేసుకుంటున్నాడు కాబ‌ట్టి జ‌గ‌న్ అద్భుతంగా ప‌రిపాలిస్తున్న‌ట్లే అని నాని అన్నాడు. బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని.. బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ప‌వ‌న్ ను ఉద్దేశించి నాని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేలేదని జ‌న‌సేనాని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని నాని మండి ప‌డ్డారు.

మ‌రోవైపు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడి మీదా నాని విరుచుకుప‌డ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వనరులను దోచుకోవచ్చని, ప్రభుత్వ పథకాలపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని.. నిజానికి చంద్రబాబే పెద్ద 420 అని విమ‌ర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో 39 లక్షల మందికి ఇచ్చే పెన్షన్లను.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 54 లక్షల మందికి పెంచారని.. తమ ప్రభుత్వం పెన్షన్‌ ను రూ.2,250కి పెంచిందని చెప్పారు. పెన్షన్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా వాలంటీర్లతో ఇంటి వద్దనే అందచేస్తున్నామని పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా 44 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరిందని.. జగన్ స‌ర్కారు అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే సంక్షేమ పథకాలతో కోటిమందికిపైగా ప్రజలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ కన్నా ‘ఎల్లో’ వైరస్‌ మరింత ప్రమాదకరమైంద‌ని.. చైనాలో కరోనా వైరస్‌ ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లో వైరస్ విజృంభిస్తోందంటూ ప‌రోక్షంగా తెలుగుదేశం పార్టీని ఎద్దేవా చేశారు.