Begin typing your search above and press return to search.

ఆపరేషన్ కు నో చెబుతున్న పవన్.. కారణమిదే..

By:  Tupaki Desk   |   30 Sep 2019 10:29 AM GMT
ఆపరేషన్ కు నో చెబుతున్న పవన్.. కారణమిదే..
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తాజాగా జనసేన పార్టీ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఇదే ఆయన అభిమానులను కలవరపరుస్తోంది. పవన్ ఎంతో బాధను అనుభవిస్తున్నాడని.. ఎన్నికల నుంచే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది. కానీ ఆపరేషన్ చేయించుకోకుండా పంటి బిగువన పట్టి దాన్ని అనుభవిస్తున్నట్టు జనసేన పార్టీ విడుదల చేసిన లేఖతో స్పష్టమైంది.

‘గబ్బర్ సింగ్ ’ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ వెన్నుపూసకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటినుంచి వెన్నునొప్పి బాధిస్తోందట.. అసెంబ్లీ ఎన్నికల్లో అది పెరగగా ఫారిన్ కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అయితే ఆ సమస్యను అశ్రద్ధ చేయడంతో తాజాగా మళ్లీ వెన్నునొప్పి తిరగబెట్టింది.

కొద్దిరోజుల నుంచి పవన్ కాలు బయటపెట్టకుండా మంచానికే పరిమితమై రెస్ట్ తీసుకుంటూ చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిసింది. వెన్నునొప్పి సమస్యతోనే పవన్ ఇటీవల ‘సైరా’ ప్రిరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అయితే ఆపరేషన్ అవసరం అని డాక్టర్లు తెలుపగా.. ప్రకృతి చికిత్స ద్వారా పవన్ దాన్ని కంట్రోల్ చేస్తానని తెలిపారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ మాత్రం ప్రకృతి వైద్యంతో శస్త్రచికిత్స లేకుండానే దాన్ని కంట్రోల్ చేసే పనిలో పడ్డారు.