Begin typing your search above and press return to search.
రోహిత్ ఆత్మహత్యపై రాజకీయం: పవన్ అసహనం
By: Tupaki Desk | 1 Feb 2016 3:56 PM GMTనిన్న తునిలో జరిగిన సంఘటనపై మీడియా ముందుకొచ్చిన పవన్ కు మీడియా ప్రతినిధుల నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటనపై చంద్రబాబు నాయడు మీడియా ముందు మాట్లాడిన మాటలకు కొనసాగింపుగానే మీ వాఖ్యాలున్నాయని, చంద్రబాబును కాపాడటానికే మీరు ప్రతిసారి ప్రయత్నిస్తున్నారని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దానికి పవన్ స్పందిస్తూ... తాను ప్రభుత్వానికి అనుకులంగా కానీ, చంద్రబాబును కాపాడటానికి ప్రయత్నించడం లేదన్నారు. తన దృష్టికి ఏమైనా సమస్యలు వస్తే.. ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆ హామీని నిలబెట్టుకోవాలి. రిజర్వేషన్లు ఇస్తామంటే ఇస్తామనండి. లేకుంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నారో వారికి చెప్పండి అంటూ ప్రభుత్వానికి సూచించారు. చిరంజీవి కూడా రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబుకు లేఖ రాశారు కదా అని ఓ మీడియా ప్రతినిథి పవన్ దృష్టికి తీసుకురాగా... తాను కూడా ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ ఆత్మహత్యపై రాహుల్, కేజ్రీవాల్ లాంటి వాళ్లు ఢిల్లీ నుంచి వచ్చి స్పందిస్తుంటే... మీరు ఇక్కడే వుండి స్పందించకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తే... రోహిత్ మరణం బాధకలిగించిందన్నారు. అయితే అతని మరణాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. తాను నెల్లూరులో చదువుకునే రోజుల్లో తన గురువు కుమారుడు అనంతపురం జేఎన్టీయూ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతూ ఇలాంటి కుల వివక్షత కారణంగానే మరణించాడని, అలాగే తాను వైజాగ్ లో చదువుకునే రోజుల్లో ఆంధ్ర యునివర్శిటీలో ప్రొఫెసర్లు విద్యార్థులతో కలిసి కుల టూర్లు వేసేవారని, ఇలాంటి కులవివక్ష యూనివర్శిటీల్లో చాలా కాలం నుంచి వస్తోందన్నారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ రాసిన లెటర్ కారణంగానే రోహిత్ మరణించాడని అడుగగా... ఇంతకు ముందు చాలా మంది మంత్రులు ఉత్తరాలు రాశారని.. వాటి సంగతేంటని ఆయన ప్రశ్నించాడు. ఓ విద్యార్థి ఇలా నిరాశ నిస్పృహలతో మరణించడం బాధాకరం అన్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల గురంచి స్పందించమని అడిగితే... ఎన్నికల కోడ్ ఉన్నందున దానిపై స్పందించనన్నారు.