Begin typing your search above and press return to search.
అవిశ్వాసానికి తాంబూలాలిచ్చేసిన పవన్!
By: Tupaki Desk | 17 Feb 2018 5:38 PM GMTమొత్తానికి నరేంద్రమోడీ ప్రభుత్వానికి కాకపుట్టించే ఒక్క ప్రకటన విషయంలో పవన్ కల్యాణ్ స్పష్టంగా మాట్లాడినట్టే. నిన్న మరియు ఇతర సందర్భాల్లో పవన్ కమిటీలోని కీలక వ్యక్తి ఉండవిల్లి అరుణ్ కుమార్ ఏ ప్రయత్నాన్ని సూచిస్తున్నారో.. దానికి పవన్ కూడా ఓటు వేశారు. తెలుగుదేశం - వైసీపీలకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు అయినా చేయొచ్చు - మోడీ సర్కారు పై అవిశ్వాసం అయినా పెట్టొచ్చు.. అని పవన్ స్పష్టీకరించారు. తాను మాత్రం కమిటీ నివేదిక తేలేదాకా ఎలాంటి డెడ్ లైన్ లు పెట్టనని - ఎలాంటి పోరాటం ప్రణాళికను ప్రకటించనని ఇంకా నాన్చుతున్న పవన్ కల్యాణ్.. కేంద్ర సర్కారుపై అవిశ్వాసం విషయంలో.. ’తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి’ సామెత చందంగా.. తెదేపా - వైసీపీ ల చిత్తశుద్ధికి ఒక లిట్మస్ టెస్టును ప్రకటించేసి అక్కడితో చేతులు దులిపేసుకుంటున్నారు.
బాబును అనడానికి పవన్ కు భయమెందుకు?
‘ప్రత్యేకహోదా విషయంలో కేంద్రాన్ని నిలదీసేందుకు ఎంపీలు ఎందుకు భయపడ్డారో అర్థం కావడం లేదని’ పవన్ కల్యాణ్ అంటున్నారు. నిజానికి పవన్ సమస్య అర్థం కాకపోవడం కాదు. ఎంపీలందరూ హోదా అడగడానికి భయపడ్డారని ఆయన గుర్రాన్నీ గాడిదనూ ఒకే గాటన కట్టేసినట్టుగా మాట్లాడడం తప్పు. వైకాపా ఎంపీ లు ఇవాళ్టికి కూడా ప్రత్యేకహోదా ఎజెండా మీదనే రాజీనామాలకు సిద్ధం అవుతున్నారు. హోదా విషయం అడగకపోయినా,, అసలు హోదా అనేదానిని మంటగలిపేసి ప్యాకేజీ అనే రాష్ట్రద్రోహానికి దిగజారి అంగీకరించినా.. ఆ పాపం పూర్తిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుది మాత్రమే. ఈ విషయం అప్పటి రాజకీయ పరిణామాలను గమనించిన పిల్లలకు కూడా తెలుసు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం.. చంద్రబాబును పల్లెత్తు మాట అనడానికి భయపడిపోతున్నట్లుగా కనిపిస్తోంది. కేంద్రాన్ని అడగడానికి ఎంపీలకు భయ మెందుకు అంటున్న ఆయన, అసలు చంద్రబాబును అనడానికి తానెందుకు అంతగా భయపడిపోతున్నారో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. హోదాను ప్రజలే మరచిపోయేలా చేసిన అసలు పాపం తెదేపాది అయితే.. అందరు ఎంపీలకు దానిని ఆపాదించి మాట్లాడడం ఎంత మేర సబబు అంటున్నారు.
ఎంపీల చేతగానితనం వల్ల ప్రజలు నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయనేది పవన్ వాదన. యువతరం నివురు గప్పిన నిప్పులా ఉన్నదని, వారు బద్ధలవకముందే సమస్య పరిష్కారం కావాలనే ఉద్దేశంతోనే తాము పనిచేస్తున్నామని పవన్ చెప్పుకొచ్చారు.
వారి గురించి తెలియదంటే సరా?
వైసీపీ ఎందుకు డెడ్ లైన్ పెట్టిందో తనకు తెలియదని పవన్ కల్యాణ్ అంటున్నారు. తాను జవాబు చెప్పలేని ప్రశ్న ఎదురైనప్పుడు.. ‘వారెవ్వరో - వారేం చేస్తున్నారో నాకు తెలియదు’ అనే డైలాగు వేయడం ఇవాళ నాయకులకు సులభమైన దొంగదారి అయిపోయింది. సమకాలీన ప్రపంచంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఒక పార్టీ ఇదే సమస్య మీద ఎలా వ్యవహరిస్తున్నదో తెలుసుకోకుండానే - తాను కూడా ఒక బుల్లి రాజకీయ పార్టీ నాయకుడిగా రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తా అని పవన్ కల్యాణ్ భావించడం ప్రజలకు చిత్రంగా కనిపిస్తోంది.