Begin typing your search above and press return to search.

కేసీఆర్ అంటే గౌర‌వం ఉంది భ‌యం లేదు

By:  Tupaki Desk   |   23 March 2019 4:35 AM GMT
కేసీఆర్ అంటే గౌర‌వం ఉంది భ‌యం లేదు
X
ప‌వ‌న్ కేసీఆర్ ఇంటికి వెళ‌తాడు. ఆయ‌న కోసం గంట‌ల కొద్దీ వెయిట్ చేస్తారు. అలాంటి ఆయ‌న‌.. కేసీఆర్ మీద విమ‌ర్శ‌లు చేయ‌ట‌మా? అంటూ ప‌వ‌న్ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న్ను విమ‌ర్శిస్తుంటారు. ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్ అధికార నివాసంలో జ‌రిగిన వేడుక‌లోనూ కేసీఆర్‌.. ప‌వ‌న్ లు ఇద్ద‌రు చాలాసేపు మాట్లాడుకోవ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. బాబుకు కేసీఆర్ రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న నేప‌థ్యంలో.. ఆయ‌న ప‌వ‌న్ నుద‌గ్గ‌ర పెట్టుకొని మ‌రీ మాట్లాడిన మాట‌లు ఏమిట‌న్న‌ది బ‌య‌ట‌కు రాలేదు. కానీ.. వారి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ సారాంశం ఏమిట‌న్న‌ది మాత్రం స‌స్పెన్స్ గా ఉండిపోఇంది.

ఇదిలా ఉంటే. తాజాగా ఏపీలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌వ‌న్ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఏపీ రాజ‌కీయాల్లోకి కేసీఆర్ జోక్యం చేసుకుంటున్నారంటూ వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు ప‌వ‌న్ స్పంద‌న పాజిటివ్ గా ఉండ‌ట‌మే కాదు.. ఏపీ రాజ‌కీయాల్లో కేసీఆర్ వేలు పెట్టిన‌ట్లుగా ఆయ‌న తాజా వ్యాఖ్య‌లు ఉన్నాయి.

కేసీఆర్ పై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ విమ‌ర్శ‌లు చేసిన ప‌వ‌న్‌.. అదే స‌మ‌యంలో ఆయ‌నంటే త‌న‌కు గౌర‌వ‌మంటూ వ్యాఖ్యానించటం విశేషం.

ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్ వేలు పెట్ట‌ద‌లుచుకుంటే.. గౌర‌వంగా రాష్ట్రానికి వ‌చ్చి పార్టీ పెట్టాలే కానీ.. అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. తెలంగాణ‌లో ఆంధ్రా ప్రాంతం వారు రాజ‌కీయం చేయ‌టం త‌ప్ప‌నే కేసీఆర్‌.. ఆంధ్రాలో ఆయ‌న రాజ‌కీయం చేయొచ్చా? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ కు ఆంధ్రా మీద అంత అభిమాన‌మే ఉండి ఉంటే.. ఆయ‌న త‌న అభ్య‌ర్థుల‌ను పోటీకి దింపొచ్చ‌న్నారు.

తెలంగాణ‌లో ఆంధ్రులు రాజ‌కీయం చేస్తే త‌ప్ప‌నే కేసీఆర్ ఆయ‌న మాత్రం ఏపీ రాజ‌కీయాల్లో వేలు పెట్టొచ్చా? అని ప్ర‌శ్నించారు.

‘కొన్ని నెలల క్రితం కొంతమంది త‌న‌ వద్దకు వచ్చి జనసేనలో చేరతామని చెప్పార‌ని.. కానీ త‌ర్వాత వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరార‌ని చెప్పారు. ఎందుక‌ని తాను ఆరా తీస్తే.. . ‘హైదరాబాద్‌లో మాకు ఆస్తులున్నాయి. వాటితో సమస్యలున్నాయి’ అని చెప్పారన్నారు. త‌న‌కు అప్పుడు అర్థం కాలేద‌ని.. ఇప్పుడు తెలుస్తుంద‌ని చెప్పారు. తెలంగాణ‌లో ఆస్తులు ఉన్న నేత‌ల్ని కేసీఆర్ భ‌య‌పెట్ట‌టం స‌రికాద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. త‌ల‌సాని ఏ మాత్రం సిగ్గు లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ఇస్తున్నార‌న్నారు. 2014లో త‌ల‌సాని తెలుగుదేశం అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న‌ప్పుడు కేసీఆర్ ను ఎన్నో తిట్లు తిట్టార‌న్నారు. అంతేకాదు.. త‌న ప్రచారం కోసం ఎదురుచూశార‌న్నారు. ప‌వ‌న్ ఎక్క‌డ‌? ప‌వ‌న్ ఎక్క‌డ‌? అని ఆయ‌న ప‌దే ప‌దే ఫోన్లు చేస్తూ ఎదురుచూశార‌న్నారు. అలాంటి ఆయ‌న ఇప్పుడు ఇక్క‌డ జ‌గ‌న్ పార్టీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ఇస్తారా? అని ప్ర‌శ్నించారు.

త‌ల‌సాని విభ‌జ‌న రాజకీయాలు మానేయాల‌ని.. ఇది ప‌ద్ద‌తి కాద‌న్నారు. రాష్ట్రాలు విడిపోయాయ‌ని.. కావాలంటే టీఆర్ఎస్ ను ఆంధ్రాలో కూడా స్థాపించాల‌ని.. భీమ‌వ‌రం నుంచి అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌న్నారు. ఉద్య‌మ నేత‌గా కేసీఆర్ అంటే త‌న‌కు గౌర‌వ‌మే త‌ప్పించి భ‌యం అస్స‌లు లేద‌న్నారు.