Begin typing your search above and press return to search.
కింగ్ మేకర్ కావడం అంటే అలా పవన్ కల్యాణ్ గారూ!
By: Tupaki Desk | 25 Oct 2019 5:30 PM GMTదుష్యంత్ చౌతాలా.. ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ లో మార్మోగుతున్న పేరు. మొన్నటి వరకూ ఈ పేరు ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు అతడొక హాట్ టాపిక్ అయిపోయాడు. ముప్పై ఒక్క యేళ్ల ఈ యువకుడు ఇప్పుడు హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటును శాసించబోతూ ఉన్నాడు. అటు భారతీయ జనతా పార్టీ - ఇటు కాంగ్రెస్ లు పరిపూర్ణ మెజారిటీని సాధించని నేపథ్యంలో దుష్యంత్ మద్దతు కీలకం గా మారింది. అతడు ఎవరికి సపోర్ట్ చేస్తే వారికి ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలున్నాయి.
మొన్నటి వరకూ ఎవరి అవసరం తమకు లేదన్నట్టుగా వ్యవహరించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ యువకుడి కోసం వలపన్నుతోంది. అతడిని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకూ తమ మద్దతు ఎవరికనేది దుష్యంత్ చౌతలా పార్టీ ప్రకటించలేదు.
కేవలం ఏడాది కిందటే అతడి పార్టీ ఆవిర్భవించింది. హర్యానాను ఒకప్పుడు ఏలిన కుటుంబ పార్టీ ఐఎన్ ఎల్డీ ను చీల్చి దుష్యంత్ పార్టీ ని ఏర్పాటు చేశాడు. తన ముత్తాత పేరు గుర్తుకు వచ్చేలా జననాయక్ జనతా పార్టీ పార్టీ అంటూ జేజేపీ స్థాపించాడు.
లోక్ సభ ఎన్నికల్లో దుష్యంత్ పోటీ చేశాడు. అయితే అప్పుడు రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు దుష్యంత్ టైమొచ్చింది. హర్యానాలో బలీయంగా ఉన్న జాట్ కులస్తుల మద్దతును దుష్యంత్ పొందాడని విశ్లేషకులు అంటున్నారు. జాట్ లు మూకుమ్మడిగా తమ కులస్తుడు అయిన దుష్యంత్ కు ఓటేశారని అంటున్నారు. అయితే అలా చేయడానికి దుష్యంత్ లో గట్స్ కనిపించాయి.
డైనమిక్ గా వ్యవహరించాడు - యువతను ఆకట్టుకున్నాడు, ఉపాధి అవకాశాల గురించి మాట్లాడాడు..దీంతో దుష్యంత్ కు కాలం కలిసి వచ్చింది. దుష్యంత్ లాంటి వాళ్లను చూసి పవన్ కల్యాణ్ పై చాలా మంది జాలి చూపిస్తున్నారు.
పవన్ కల్యాణ్ కూడా రాజకీయంగా దుష్యంత్ లా ఎదగవచ్చని - అయితే అతడు మాత్రం రాజకీయంగా పూర్తి రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దుష్యంత్ తన ఎన్నికల ప్రచారంలో.. కాంగ్రెస్ - బీజేపీలను ఉమ్మడిగా టార్గెట్ గా చేసుకున్నాడు. అంతే కానీ పవన్ కల్యాణ్ లా అప్పుడు - ఇప్పుడు జగన్ వ్యతిరేకతే తన పొలిటికల్ అజెండాగా వ్యవహరించలేదు.
పవన్ కల్యాణ్ తెలుగుదేశం మనిషిగానే ఇప్పటికీ చలామణిలో ఉన్నాడు. అయితే దుష్యంత్ మాత్రం అందరి వాడినంటూ వచ్చాడు.. కింగ్ మేకర్ ఎదిగాడు. కింగ్ మేకర్ గా ఎదగడం ఎలానో.. పవన్ కల్యాణ్ దుష్యంత్ సింగ్ చౌతాలా వంటి వారి రాజకీయ పయానాలను అధ్యయనం చేయాలని పరిశీలకులు సూచిస్తున్నారు!