Begin typing your search above and press return to search.
కాల్ చేస్తే..ఆ ఎంపీ ఫోన్ తీయలేదంటున్న పవన్
By: Tupaki Desk | 9 Dec 2017 4:44 PM GMT2014 ఎన్నికల్లో తాను గెలుపు కోసం కృషి చేసిన నేతలు తనపట్ల వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఫోన్ చేసినప్పటికీ...ఓ అధికార పార్టీ ఎంపీ ఫోన్ తీయలేదని వ్యాఖ్యానించారు. ఒంగోలులో పర్యటించిన పవన్ కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మృతుల బంధువులు ప్రమాదం గురించి పవన్ కు వివరించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ....``అరెస్ట్ చేసిన తన అభిమానులను విడుదల చేయించాలని తాను ఒకసారి ఎంపీ గోకరాజు గంగరాజుకు ఫోన్ చేస్తే ఆయన కనీసం నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు...అవకాశవాద రాజకీయాలకు ఇదే నిదర్శనం` అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా `కొందరు టీడీపీ నేతలు నన్ను అవమానించినా కేవలం ప్రజల కోసమే టీడీపీకి మద్దతిచ్చాను..` అని పేర్కొన్నారు. ఓ మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చానని - ఆ ఆశయాలు మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపించాలనే ఆలోచనతో జనసేన పెట్టానన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ 'ఒకరికి వస్తే కోపం.. పదిమందికి వస్తే ఉద్యమం' అని సినిమాలోని డైలాగుని ఉదహరించారు. ఏ ఉద్యమం సాగాలన్నా ముందు ఒక అడుగు పడాలి. ఆ వెనుక వేల అడుగులు తోడుగా నిలుస్తాయి అని అన్నారు. భావితరాలకు మంచి చేయాలన్న తలంపుతోనే జనసేన ఆవిర్భవించిందన్నారు.
కాగా, ఈ పరామర్శ సందర్భంగా ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి పవన్ మాట్లాడారు. విహార యాత్రకు వెళ్లి మృత్యువాతపడటం చాలా బాధాకరమన్న పవన్.. బాధితులకు న్యాయం జరగాలన్నారు. పరిహారాలతో పోయిన ప్రాణాలు తిరిగిరావని.. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఎవర్నీ నిందించడానికి రాలేదన్న పవన్‌కల్యాణ్.. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.