Begin typing your search above and press return to search.
ఎవరిని సైడ్ చేయాలో డిసైడ్ చేయనున్న పవన్... ?
By: Tupaki Desk | 6 March 2022 10:53 AM GMTఏపీ రాజకీయాల్లో పవన్ ది క్రిష్ణుడి పాత్రగా చూడాలి. ఆయన గోపాలా గోపాలా సినిమాలో అలాంటి క్రిష్ణ పాత్రనే పోషించారు. ఇక 2014 ఎన్నికల్లో పవన్ టీడీపీ బీజేపీ కూటమికి తాను మద్దతు ఇస్తానని ప్రకటించి వైసీపీని అధికారంలో రానీయకుండా చూశారు. 2019లో తీసుకుంటే ఆయన ఆ రెండు పార్టీలను దూరంగా పెట్టి కామ్రేడ్స్, బీఎస్పీలతో కలసి పోటీకి దిగారు. అయితే పవన్ కూటమి ఓట్లను భారీగా చీల్చడంతో టీడీపీకి దారుణమైన ఓటమి ఎదురైంది. అదే టైమ్ లో వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిచింది.
ఇక ఇపుడు చూస్తే 2024 ఎన్నికలు చాలా కీలకంగా మారుతున్నాయి. ఏపీలో చూస్తే వైసీపీ బలమైన పార్టీగా కనిపిస్తోంది. విపక్ష టీడీపీ క్షేత్ర స్థాయిలో గట్టిగా ఉన్న పార్టీ. అయినా సరే ఈ రెండు పార్టీల బలాలు ఎలా ఉన్నా కూడా జయాపజయాలను ప్రభావితం చేసే స్థాయిలో జనసేన ఈసారి ఏపీ పొలిటికల్ ఫీల్డ్ లో ఉండబోతోంది అన్నదే ఒక విశ్లేషణ.
చూడబోతే పవన్ కళ్యాణ్ జనసేన ఈ మూడేళ్ల కాలంలో బలపడింది. ఎవరు కాదన్నా కూడా 2019లో ఆ పార్టీకి వచ్చిన ఆరు శాతం కంటే ఈసారి ఎక్కువగానే ఓటింగ్ వస్తుంది. అది ఎంత మేరకు పెరుగుతుంది అన్న దాని మీద జనసేన రాజకీయ అవకాశాలతో పాటు ఇతర పార్టీల జాతకాలు కూడా ఆధారపడిఉన్నాయి.
ఇక జనసేన వైపు బలమైన సామాజిక వర్గం ఉంది, 2024 నాటికి ఆ వర్గం ఓట్లు టోటల్ గా పోలరైజ్ అయి కచ్చితంగా జనసేన బలపడుతుంది అని అంచనా వేస్తున్నారు. దాని ప్రభావం ఉత్తరాంధ్రా ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా అంతటా దాదాపు ఎనభై నియోజకవర్గాల మీద ఉంటుంది అని తెలుస్తోంది. మరి ఏపీలో సగానికి పైగా ఉన్న సీట్లలో జనసేన ప్రభావం గట్టిగా ఉంటే ప్రధాన పార్టీల రాజకీయ అవకాశాలు ఆ మేరకు అటో ఇటో తారు మారు కాక తప్పదనే చెప్పాలి.
ఇక జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. టీడీపీ ఆ పార్టీని తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. జనసేన విడిగా పోటీ చేస్తే తమకెంత భారీ స్థాయిలో డ్యామేజ్ అవుతుందో టీడీపీకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే చంద్రబాబు వన్ సైడ్ లవ్ అంటూ ఓపేన్ ఆఫర్ ఇచ్చారు. ఇక జనసేన టీడీపీ కలిస్తే తమ సీటుకు ముప్పు అన్న సంగతి వైసీపీ పెద్దలకు ఇంకా బాగా తెలుసు. దాంతోనే వారు జనసేనను టీడీపీని కలవనీయకుండా చూడాలనుకుంటున్నారు.
అయితే ఇన్నిరాజకీయ సమీకరణల మధ్యన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ నెల 14న గుంటూరు జిల్లాలో అమరావతి వద్ద ఘనంగా జరగబోతున్నాయి. ఈ సందర్భంగా పవన్ సంచలన ప్రకటనలే చేస్తారని అంతా భావిస్తున్నారు. ఆయన చేసే ప్రకటలంతో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేగడం ఖాయమని కూడా అంటున్నారు. అప్పటికి ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా వెలువడతాయి కాబట్టి బీజేపీ మీద తన స్టాండ్ ఏంటన్నది కూడా పవన్ చెప్పబోతారు అని అంటున్నారు.
అదే టైమ్ లో వన్ సైడ్ లవ్ అంటూ ఆఫర్లు ప్రకటిస్తున్న టీడీపీ విషయంలో కూడా పవన్ ఏం నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ అయితే అందరిలో ఉంది. బీజేపీతో కటీఫ్ చేసుకుని పవన్ టీడీపీతో చేతులు కలిపితే కనుక ఏపీలో వైసీపీకి రాజకీయంగా పెను సవాల్ విసిరినట్లే అంటున్నారు. అలా కాకుండా పవన్ బీజేపీతోనే తన జట్టు అని మరోసారి ఒట్టేసి మరీ చెప్పేశారు అంటే మాత్రం ఏపీలో వైసీపీ రాజకీయానికి ఇంకా అవకాశాలు ఉన్నట్లే అని అంటున్నారు.
మొత్తానికి ఏపీ రాజకీయ త్రాసులో చెరో వైపు టీడీపీ వైసీపీ ఉన్నాయి. పవన్ టీడీపీ వైపు మొగ్గితే మాత్రం వైసీపీ 2024లో గెలవడానికి అష్టకష్టాలు పడాల్సి ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి పవన్ డెసిషన్ ఎవరిని సైడ్ చేస్తుందో.