Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ సైలెంట్... చిరుని కాపాడాడా...?
By: Tupaki Desk | 26 April 2023 7:00 PM GMTపవన్ కళ్యాణ్ సినీ రాజకీయ నేపధ్యం ఉన్న వారు. ఆయన టాలీవుడ్ లో టాప్ హీరో. రాజకీయాల్లో తన లక్ ని టెస్ట్ చేసుకుంటున్నారు. జనసేనను స్థాపించి దాదాపుగా పదేళ్లకు దగ్గరపడుతోంది అయితే పవన్ మార్క్ ఇంతవరకూ పొలిటికల్ గా అయితే చూపించలేదు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే 2024 ఎన్నికలు చాలా కీలకమైనవి. అన్ని పార్టీలకు కఠిన పరీక్షగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయని అంటున్నారు. వైసీపీ టీడీపీ ఈ విషయంలో ప్రతీ దాన్ని సీరియస్ గా తీసుకుని ముందుకు పోతూంటే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ మాత్రం సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు. జనసేన పార్టీ యాక్టివిటీ అంటి అన్న చర్చ అయితే సాగుతోంది.
ఇక పవన్ కళ్యాణ్ వారాహీ రధం ఒకటి రెడీ చేయించి ఆరు నెలల క్రితం ఊరేగింపు చేశారు. ఎవడురా మనలను అడ్డుకునేది అని కూడా జనసైనికులకు పవర్ ఫుల్ స్లోగన్ ఇచ్చారు. అలాంటి వారాహి రధాని అడ్డుకున్నది ఎవరు, దాన్ని షెడ్డు నుంచి బయటకు తేకుండా బ్రేకులు వేస్తున్నది ఎవరు, ఇంతకీ పవన్ వరసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు తప్ప రాజకీయాల గురించి ఆలోచించడంలేదు ఎందుకు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
ఇంకో వైపు చూస్తే పవన్ జనసేన పొత్తుల కధ కూడా అలాగే ఉంది. బీజేపీతో తెంచుకోవడంలేదు, తెలుగుదేశం వైపు రావడంలేదు. ఆయనకు మనసులో అయితే మూడు పార్టీలు కలవాలని ఉంది. దానికి బీజేపీ నుంచి పెద్దగా రియాక్షన్ రాకపోయేసరికి ఆయన సైలెంట్ అయ్యారని అంటున్నారు.
మరి బీజేపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీతో పొత్తులు పెట్టుకుని ఏపీ రాజకీయాల్లో దూకుడు చేయవచ్చు కదా అన్న చర్చ కూడా ఉంది. అయినా సరే పవన్ సైలెంట్ గానే ఉంటూ వస్తున్నారు ఎందుకు అంటే దాని మీదనే ఇపుడు అంతా గుసగుసలు పోతున్నారుట.
అదేంటి అంటే పవన్ సైలెంట్ వెనక కూడా ఒక కీలక మ్యాటర్ ఉంది అని అంటున్నారు. టాలీవుడ్ మీద ఐటీ ఫోకస్ పెట్టి బిగ్ బ్యానర్లు, బడా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ల మీద దాడులు చేస్తోంది.
మరి టాలీవుడ్ లో శిఖరాయమానంగా మెగాస్టార్ గా చిరంజీవి ఉన్నారు. మరి ఐటీ దాడులు ఆయన మీద కూడా జరుగుతాయని ప్రచారం అయితే ఉంది. కానీ జరగలేదు. ఎందుకు అలా అంటే దాని మీదనే ఇపుడు పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవి మీద ఐటీ రైడ్స్ జరగకుండా పవన్ ఆపారని అంటున్నారు. ఆ విధంగా బీజేపీతో తన బంధాన్ని స్నేహాన్ని పవన్ గట్టి పరచుకుని వాడుకున్నారని అంటున్నారు.
ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ నిన్న కాక మొన్న పెట్టిన కొన్ని టాలీవుడ్ నిర్మాణ సంస్థల మీద దాడులు చేస్తున్న ఐటీ వారు మెగా శిఖరం వైపు తొంగి చూడకుండా వంగి వాలకుండా వెళ్లిపోయారు అంటే ఏదో జరిగి ఉంటుందని కూడా గుసగుసలు అయితే ఉన్నాయి. ఆ ఏమై ఉంటుంది అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో నేరుగా రాజకీయ బంధం ఉన్న పవన్ కళ్యాణే అన్నను కాపాడడానికి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళి చేయాల్సింది చేశారు అని అంటున్నారుట.
ఏది ఏమైనా టాలీవుడ్ లో వరస ఐటీ రైడ్స్ తో బెంబేలెత్తి పోతోంది. ఇది ఆగుతుందా ఇంకా ముందుకు సాగుతుందా తెలియదు కానీ ఇందులో కూడా తర తమ భేదాలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. పెద్ద చేపలను బిగ్ షాట్స్ ని వదిలెసి కొందరి మీద మాత్రమే ఐటీ కత్తి ఝలిపించడం పట్ల మాత్రం తీవ్ర స్థాయిలో చర్చ అయితే సాగుతోంది. ఏది ఏమైనా పవన్ సైలెంట్ వెనక ఏదో ఉందనే వారు గుసగుసలు పోతున్న వారు ఉండడమే ఇక్కడ చర్చ.