Begin typing your search above and press return to search.
ఇంగ్లిషు షో కు వ్యాఖ్యాతగా పవన్?
By: Tupaki Desk | 6 Aug 2018 12:15 PM GMTనటీనటులు - సెలబ్రిటీలు - రాజకీయ - వ్యాపార వేత్తలు ....ఇలా సెలబ్రిటీలంతా.....టీవీ షో ల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో తో నాగార్జున - చిరంజీవి బుల్లితెరతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో తో జూనియర్ ఎన్టీఆర్ - నాని...బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ....అలాగే అందులో పార్టిసిపేట్ చేసిన కౌశల్ - తేజస్విని - ఆదర్శ్ - శివబాలాజీ వంటి వారు పాపులర్ అయ్యారు. అదే తరహాలో ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తన వాయిస్ వినిపించేందుకు, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా చానెల్ లో పవన్ ఇంగ్లిషులో `ఇండియా అహేడ్` పేరుతో ఓ షోను నిర్వహించబోతోన్నారని తెలుస్తోంది.
ఇరు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు - ఉన్నత విద్యావంతులు - యువకులకు మరింత చేరువయ్యేందుకు పవన్ త్వరలోనే బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఓ జాతీయ న్యూస్ ఛానెల్ లో సామాజిక సమస్యలపై రూపొందించిన కార్యక్రమానికి పవన్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నారట. దాదాపుగా, అమీర్ ఖాన్ ‘సత్యమేవ జయతే’ తరహాలో ఈ ప్రోగ్రాం ఉండనుందని, అయితే దానికి కాపీ కాదని తెలుస్తోంది. వారంలో రెండుసార్లు ఈ షోను టెలికాస్ట్ చేయనున్నారట. `ఇండియా అహేడ్`అనే టైటిల్ కూడా ఈ షోకు ఖరారైందని తెలుస్తోంది. ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన థీమ్ - స్క్రిప్ట్ కోసం పవన్ కల్యాణ్ టీం హోమ్ వర్క్ చేస్తోందట. మరి కొద్ది వారాల్లో ఈ కార్యక్రమం ప్రసారం కానుందని తెలుస్తోంది. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అరగంట సేపు ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్యల గురించి ఇందులో చర్చించబోతున్నారట. దాంతోపాటు, జనసేన సిద్ధాంతాలు....ప్రజాసమస్యలపై జనసేన వైఖరిని ఈ షో ద్వారా ...ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పవన్ ప్లాన్ చేస్తున్నారట.