Begin typing your search above and press return to search.
నిహారిక చేసింది.. 'తప్పు' అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారా?
By: Tupaki Desk | 4 April 2022 4:30 PM GMTహైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 6లోని `ఫుడింగ్ అండ్ మింక్ పబ్` వ్యవహారంలో 148 మంది యువతీ యువకులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో ప్రముఖుల పిల్లలు ఉన్నారని మీడియాలో ప్రచారం కావడంతో కొందరు ప్రముఖులు స్పందించారు. పబ్‌లో తమ పిల్లలు లేరని, వారికి డ్రగ్స్ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇక, ఈ పార్టీలోనే మెగా కుటుంబం గారాలపట్టి.. నిహారిక కూడా ఉన్నారు. ఆమెను కూడా స్టేషన్‌కు తరలించారు. అయితే.. దీనిపై నిహారిక తండ్రి నాగబాబు వెంటనే రియాక్ట్ అయ్యారు. రేవ్ పార్టీకి తన కుమార్తె నిహారిక వెళ్లిన విషయాన్ని నాగబాబు అంగీకరిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
పరిమిత సమయాన్ని మించి పబ్ నడిపినందువల్లే పోలీసులు పబ్‌పై చర్యలు తీసుకున్నారని ఆయన చెప్పారు. నిహారిక విషయంలో ఎటువంటి తప్పూ లేదని పోలీసులు తమకు సమాచారం ఇచ్చారని ఆయన తెలిపారు. ఇక, ఈ విషయంలో మెగా కుటుంబానికి చెందిన ఏ ఒక్కరూ రియాక్ట్ కాలేదు. కనీసం.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే.. మెగా కుటుంబ సభ్యులు సైతం.. ఎవరూ దీనిపై ఒక్క కామెంట్ కూడా చేయలేదు. అయితే.. ఇప్పుడు.. ఈ కుటుంబానికి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి. అది కూడా ఆయన కీలకంగా భావిస్తున్న వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని చెబుతున్న ఏపీ నుంచే కావడం గమనార్హం.
ఇక్కడ ఏపీలో అధికార పార్టీవైసీపీకి, జనసేనకు మధ్య తీవ్రస్తాయిలో రాజకీయ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఏ చిన్న విషయం జరిగినా.. పవన్ రియాక్ట్ కావడం.. వైసీపీ సర్కారుపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం కొన్నాళ్లుగా గమనిస్తూనే ఉన్నాం. ఎస్సీలపై దాడులైనా.. రహదారుల నిర్మాణమైనా.. ఇలా ఏ విషయమైనా.. కూడా పవన్ రియాక్ట్ అవుతున్నారు. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజల మనోభావాలకు ఎలాంటి విలువ జగన్ సర్కారు ఇవ్వలేదంటూ.. పవన్ దుయ్యబట్టారు. మరి ఇంతగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే.. పవన్.. మరి తన ఇంటి విషయంపై ముఖ్యంగా నిహారిక విషయంపై ఎందుకు సైలెంట్ అయ్యారనేది వైసీపీ నేతల నిలదీత!
``నిహారిక విషయంలో పవన్ ఎందుకు రియాక్ట్ కాలేదు`` అని.. వైసీపీలోని కీలక నేతలే.. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. ఏపీ సర్కారుపై ఒంటెత్తు విమర్శలు చేసే పవన్ పెద్ద ఎత్తున ఏకంగా 148 మందిని స్టేషన్‌కు తీసుకువెళ్లిన కేసులో.. అక్కడి సర్కారుపై ఎందుకు కామెంట్లు చేయలేదు? అని .. ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. మచ్చలేని మెగా కుటుంబానికి చెందిన మహిళ, మెగా కుటుంబానికి గారాల పట్టిగా పేరున్న నిహారిక పట్టుబడిన సందర్భంలో ఎందుకు పవన్ జోక్యం చేసుకోలేదు? ఇంత జరుగుతున్నా.. కనీసం.. చీమకుట్టినట్టు కూడా స్పందించలేదు? అనేది వైసీపీ నేతల నిలదీత. ఈ సమయంలోనే గతంలో జరిగిన ఘటనలు వారు గుర్తు చేస్తున్నారు.
ఎక్కడో గుజరాత్‌లోని బాంద్రా పోర్టులో పట్టుబడిన.. డ్రగ్స్ విషయంలో ఏపీకి ముడిపెట్టి.. జనసేన నేతలు.. రోడ్డెక్కారని.. అదేస యమలో కాకినాడ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ విషయంలోనూ.. ప్రభుత్వాన్ని నిలదీశారని.. మరి.. నేరుగా మెగా కుటుంబానికి చెంది న మహిళ.. పట్టుబడితే.. పవన్ ఎందుకు మౌనంగా ఉన్నాడని వైసీపీ సీనియర్లు కూడా గుసగుసలాడుతున్నారు. మరి దీనిపై జనసేన నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదేమైనా బంజారాహిల్స్ ఘటన.. రాజకీయంగా దుమారం రేగే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. కీలక అధికారుల పిల్లలు.. కీలక పార్టీల నేతల పిల్లలు ఈ వ్యవహారంలో ఉండడంతో ఎవరికి వారు మౌనంగా ఉండిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.