Begin typing your search above and press return to search.
బాబును ఇమిటేట్ చేసి పవన్ సెటైర్లు
By: Tupaki Desk | 5 Nov 2018 5:08 AM GMT‘చూడప్పా సిద్దప్పా.. నేను సింహం లాంటోన్నప్పా’ అంటూ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్. ఆయన డైలాగ్ డెలివరీ కానీ.. పదునైన పవర్ ఫుల్ పంచులు కానీ జనాన్ని విపరీతంగా ఆకర్షించాయి.. సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చాక ఆ డైలాగులను వినలేకపోతున్నామని.. పవన్ నటనాకౌశలానికి కాస్త దూరమవుతున్నామని అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. కానీ పవన్ మళ్లీ దుమ్ము దులిపాడు. రాజకీయ వేదికపై సినిమా స్టైల్లో విసిరిన పంచ్ పటాసులా పేలాయి.
తాజాగా జగ్గంపేటలో నిర్వహించిన సభలో అచ్చం చంద్రబాబు ను పోలిన గొంతుతో ఆయన హావభావాలు అనుకరిస్తూ ఆయన డైలాగులకు పవన్ సైటైరుగా వల్లెవేశారు. చంద్రబాబును ఎగతాళి చేస్తూ అనుకరించాడు. ఈ డైలాగ్ కు సభకు వచ్చిన జనం, అభిమానులు ఈలలు,గోళలు వేసి ఫిదా అయ్యారు.
చంద్రబాబు గొంతుతో పవన్ మాట్లాడుతూ.. ‘తమ్ముళ్లు.. మీరందరూ త్యాగాలు చేయాలి’ అంటూ మొదట పలికాడు. దానికి కొంచెం మసాలా యాడ్ చేసి.. ‘తమ్ముళ్లూ.. మిమ్మల్ని త్యాగం చేయమని నేను చెప్పను.. తమ్ముళ్లు.. మీ కోసం నేనే, మా పార్టీ త్యాగం చేస్తుంది’ అని కౌంటర్ ఇచ్చాడు. ఇలా చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కనుమరుగైపోతాడని అర్థం వచ్చేలా పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు జనాన్ని ఉర్రూతలూగించాయి. చంద్రబాబును పోలిన గొంతుతో పవన్ మాట్లాడుతుంటే అచ్చం యాక్టర్ పవన్ గుర్తుకు వచ్చాడని అభిమానులు సంబరపడ్డారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చాక తొలిసారి తన నటనా కౌశలాన్ని ప్రదర్శించాడు.
ఇలా పవన్ సినిమాల్లో వేసే డైలాగులను బయట వేసేసరికి జనాలు ఫ్రీగా వినోదభరితమైన సినిమా చూసిన ఫీలింగ్ కు గురయ్యారట.. దీన్ని తాము బాగా అస్వాదించామని, పవన్ ఇలానే ప్రచారం చేయాలని పలువురు అభిమానులు కోరుతున్నారు.