Begin typing your search above and press return to search.
వైసీపీ మెడలు వంచుతాం.. పవన్ హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 26 Jan 2023 11:35 PM GMTఏపీని మరోసారి విడగొడతామంటే తోలుతీసి విరగ్గొడతానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ హెచ్చరించా రు. మంగళగిరిలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్.. జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ‘‘వేర్పాటు వాద ధోరణితో ఎవరైనా మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని ఇంకొకరిని చూడరు. ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. వాళ్ల మెడలు వంచి జవాబు చెప్పిస్తాం` అన్నారు.
‘‘ప్రజల కోసమే జనసేన కార్యాలయం. ప్రజలకు ఏ సమస్య ఉన్నా జనసేన ఆఫీస్‌కు రావచ్చు. వారాహిని రోడ్లపై తిరగనివ్వబోమని హెచ్చరించారు. నేను కోడి కత్తితో పొడిపించుకుని రాలేదు. చట్ట ప్రకారం వారాహికి అన్ని అనుమతులు తీసుకున్నా. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో సహా వేల కోట్లు కాజేశారు. దోచుకున్న మీరే ఇలా ఉంటే.. నిజాయితీగా ఉన్న మాకెంత ఉండాలి?`` అని పవన్ వ్యాఖ్యానించారు.
అదేసమయంలో మంత్రి ధర్మానపైనా పవన్ విరుచుకుపడ్డారు. ``ఏమయ్యా ధర్మాన.. నీకు ప్రత్యేక రాష్ట్రం కావాలా? ధర్మాన.. బైరెడ్డి ప్రత్యేక రాష్ట్రాలు అంటే సరిపోతుందా? రాయలసీమ అనే వాళ్లు ఎందుకు అక్కడ అభివృద్ధి చేయలేదు. ముఖ్యమంత్రులందరూ రాయలసీమ నుంచి వచ్చే కదా పాలించారు? ప్రధానిని కలిస్తే ఈసారి సజ్జల, వైసీపీ నేతలపై ఫిర్యాదు చేస్తా`` అని చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లాలోని మంత్రి పినిపే విశ్వరూప్ ఇల్లు తగులపెట్టించుకున్నా సీఎం వెళ్లలేదని వ్యాఖ్యానించారు. ``ఎందుకంటే వాళ్లు కావాలనే నిప్పు పెట్టించుకున్నారు. అందుకే ముఖ్యమంత్రి వెళ్లలేదు. బాబాయిని చంపేసి కేసును సీబీఐకు ఇవ్వమనడం ఏమిటి?.’’ అని పవన్ ప్రశ్నించారు.
ప్రజల కోసం త్వరలోనే వారాహి యాత్ర చేపడతానని పవన్ చెప్పారు. ప్రజాస్వామ్యం అనేది సజ్జల సొంతం కాదని, జగన్ సొంతం కాదని అన్నారు. కులాల మధ్య అంతరాన్ని కొంతమంది పెంచి పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించారని, వైసీపీది దేశీయ దొరతనమని నిప్పులు చెరిగారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.