Begin typing your search above and press return to search.

పవన్ చేతిలో మూడు ఆప్షన్లు...వైసీపీ వ్యూహం చిత్తు చేసేలా...?

By:  Tupaki Desk   |   6 April 2023 10:00 PM GMT
పవన్ చేతిలో మూడు ఆప్షన్లు...వైసీపీ వ్యూహం చిత్తు చేసేలా...?
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్నది ఇప్పటిదాకా బయటపడలేదు. దీని మీద వైసీపీ నుంచి కూడా విమర్శలు సెటైర్లు పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ పోటీ చేసేందుకే సీటు లేదని ఆయన మమ్మల్ని విమర్శించడమేమిటని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తూ ఉంటారు.

అయితే పవన్ ఏమీ చేతులు ఖాళీగా పెట్టుకుని కూర్చోలేదు. ఆయనది పదేళ్ల రాజకీయ అనుభవం. అందువల్ల ఆయన అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటూంటారు. ఇక 2024 ఎన్నికలు చాలా కీలకం అని భావిస్తున్న పవన్ కళ్యాణ్ తాను పోటీ చేయాల్సిన సీటు విషయంలో ఎందుకు లైట్ తీసుకుంటారు. పవన్ ఒక స్పష్టమైన ఆలోచనతోనే ఉన్నారని అంటున్నారు.

పవన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మూడు సీట్లను ఆప్షన్ గా పెట్టుకున్నారని అంటున్నారు. ఆ మూడు చూస్తే గతంలో పోటీ చేసి ఓడిన గాజువాక, భీమవరంతో పాటు తిరుపతి సీటు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ కొత్తగా తిరుపతి యాడ్ అయింది. పవన్ ఈసారి కూడా రెండు చోట్లో పోటీకి దిగే చాన్స్ ఉందని అంటున్నారు.

అది గోదావరి రాయలసీమ రీజియన్స్ నుంచా లేక ఉత్తరాంధ్రా రాయలసీమ రీజియన్స్ నుంచా అన్నదే క్లారిటీగా లేదు అంటున్నారు. ఇందులో కామన్ పాయింట్ ఏంటి అంటే తిరుపతి సీటులో పవన్ పోటీ చేయడం పక్కా. దానికి అనేక కారణాలు ఆయనకు కలసివస్తున్నాయి. అదెలా అంటే 2009లో ఇక్కడ నుంచి ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి పోటీ చేసి గెలిచారు.

దాంతో అన్న గారి సెంటిమెంట్ ఒకటి ఉంది. రెండవది ఇక్కడ బలిజల సంఖ్య ఎక్కువ. మొత్తం నియోజకవర్గంలో వీరే పెద్ద మొత్తంలో ఉన్నారు. ఇక వైసీపీ టీడీపీలను చూస్తే రాజకీయంగా ఈ రెండు పార్టీలు పెద్ద బలంగా లేవు. అది జనసేనకు ప్లస్ పాయింట్ గా ఉంది అంటున్నారు. తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి 2019లో ఓట్ల చీలికతో గెలిచారు. అపుడు జగన్ వేవ్ ఉన్నా మెజారిటీ స్వల్పంగా ఉంది.

ఈసారి ఆయన పోటీ చేయడంలేదు, కుమారుడు అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అభినయ్ పోటీకి దిగితే విజయావకాశాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే అంటున్నారు. మరో వైపు టీడీపీ నుంచి చూస్తే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు టికెట్ దక్కదని అంటున్నారు. దానో ఆమె నుంచి సహాయ నిరాకరణ కనిపిస్తోంది. టీడీపీ కొత్త వారి కోసం చూస్తోంది. కానీ వర్గ పోరు వల్లనే 2019లో ఈ సీటు పోయింది. దాంతో సరైన క్యాండిడేట్ అయితే లేరు అనే అంటున్నారు.

దాంతో పాటు జనసేనకు పెద్ద ఎత్తున అభిమాన గణం ఉంది. పవన్ అంటే పూనకాలే అంటున్నారు. ఈ నేపధ్యంలో పవన్ దిగాలే కానీ మంచి మెజారిటీతో గెలుపు ఖాయమని అంటున్నారు. ఇక భీమవరం సీటు కూడా పవన్ కి పక్కా గెలుపు సీటే అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మీద మోజు తీరిపోయిందని, వైసీపీ గ్రాఫ్ కూడా తగ్గిన నేపధ్యంలో మరోసారి ఆయన గెలిచే సీన్ లేదని అంటున్నారు. అలాగే గాజువాక సీటులో పవన్ని ఓడించిన తిప్పల నాగిరెడ్డి తన కుమారుడికే ఈసారి సీటు అంటున్నారు.

అయితే అధినాయకత్వం కుదరదు అంటోంది. దంతో పాటు చాలా మంది వైసీపీ నేతల కన్ను ఈ సీటు మీద ఉంది. ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రభావం గట్టిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లోనే వైసీపీకి ఇక్కడ కార్పోరేటర్లు తక్కువ మంది గెలిచారు. దాంతో పవన్ వచ్చి పోటీ చేస్తే గెలిపించుకుంటామని అంటున్నారు.

మెగా ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న సీటు గాజువాక. అలాగే బలమైన కాపు సామాజికవర్గం కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. ఈ మూడు సీట్లలో ఉన్న విశేషం ఏంటి అంటే పవన్ జనసేన పొత్తులలో ఉన్నా లేకపోయినా డ్యాం ష్యూర్ గా గెలిచే సీట్లుట. ఈ మూడింటిలో కచ్చితంగా రెండు చోట్ల నుంచి పవన్ పోటీకి దిగుతారు అని అంటున్నారు. ఎన్నికలకు ఏడాది ఉన్న టైం లో వైసీపీ ఎంత ప్రయత్నం చేసినా పవన్ గెలుపుని ఆపే సీన్ లేదని అంటున్నారు. కానీ పవన్ పోటీ విషయం మాత్రం సరైన టైం లోనే రివీల్ చేస్తారని అంటున్నారు

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.