Begin typing your search above and press return to search.

బాబు వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ సీరియ‌స్ ట్వీట్‌

By:  Tupaki Desk   |   26 Oct 2018 6:55 AM GMT
బాబు వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ సీరియ‌స్ ట్వీట్‌
X
అనుకోనిది ఏదైనా షాకింగ్ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు. రాజ‌కీయంగా ఎంత స్ప‌ర్థ ఉంటే మాత్రం నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం.. బాధ్య‌తారాహిత్యంతో వ్య‌వ‌హ‌రించ‌టం అస్స‌లు చేయ‌రు. కానీ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం అందుకు భిన్నం. ఇష్యూ ఎలాంటిదైనా స‌రే.. నోరేసుకొని మీద ప‌డిపోవ‌టం.. లేనిపోని వ్యాఖ్య‌లు చేయ‌టం ఆయ‌న‌కు అల‌వాటుగా మారింది.

తాజాగా ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మీద విమానాశ్ర‌యంలో క‌త్తితో జ‌రిపిన హ‌త్యాయ‌త్నం రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్ర‌జ‌ల‌తో పాటు.. తెలుగువారంతా ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డిన ప‌రిస్థితి. ఈ ఉదంతంపై వెనువెంట‌నే పెద్ద ఎత్తున స్పంద‌న‌లు వెల్లువెత్తాయి. తెలుగు రాష్ట్రాల ప్ర‌ముఖుల‌తో పాటు.. వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు ఖండించారు.

కేసీఆర్‌..కేటీఆర్.. ప‌వ‌న్‌.. బీజేపీ ఎంపీ జీవీఎల్‌.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌తో స‌హా ప‌లువురు నేత‌లు రియాక్ట్ అయ్యారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన తీరుపై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

వైఎస్ జ‌గ‌న్ మీద జ‌రిగిన దాడిని ఆయ‌న డ్రామాగా అభివ‌ర్ణిస్తున్నారు. ఎక్క‌డైనా.. ఎవ‌రైనా త‌మ‌పైనే దాడికి ప్లాన్ చేసుకొంటారా? ఒక విప‌క్ష నేత అంత పిచ్చి ఆలోచ‌న‌లు చేసే అవ‌కాశం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. అలాంటి చిన్నపాటి లాజిక్కును వ‌దిలేసి మ‌రీ.. అడ్డ‌గోలుగా వ్యాఖ్య‌లు చేయ‌టం బాబుకే చెల్లుతుంది.

జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి నేప‌థ్యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు స్పంద‌న‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫైర్ అయ్యారు. జ‌గ‌న్ పై జ‌రిగిన దాడిని ఖండించిన ప‌వ‌న్‌.. సీఎం విమ‌ర్శ‌ల‌పై స్పందించారు. తాజాగా ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ట్వీట్ చేసి బాబుపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

ఉరుము ఉరిమి మంగ‌ళం మీద ప‌డ్డ‌ట్టు.. ఎక్క‌డేం జ‌రిగినా ముఖ్య‌మంత్రిగారు ఆయ‌న వ‌ర్గీయులు మా మీద ప‌డి ఏడుస్తారెందుకు? అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.