Begin typing your search above and press return to search.

అదే..బాబు మీద ప‌వ‌న్‌ కు న‌మ్మ‌కం పోగొట్టింద‌ట‌!

By:  Tupaki Desk   |   23 July 2018 5:05 AM GMT
అదే..బాబు మీద ప‌వ‌న్‌ కు న‌మ్మ‌కం పోగొట్టింద‌ట‌!
X
కొద్ది కాలం క్రితం వ‌ర‌కూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ప‌ల్లెత్తు మాట అనేందుకు సైతం ఇష్ట‌ప‌డే వారు కాదు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. అదే ప‌వ‌న్.. ఇప్పుడు ఏ మాత్రం అవ‌కాశం చిక్కినా మాట‌ల‌తో దునుమాడుతున్నాడు. అనుభ‌వం.. అనుభ‌వం అంటూ బాబును మోసిన ప‌వ‌న్‌.. ఇప్పుడు అదే అనుభ‌వం మీద ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు వింటే ఆశ్చ‌ర్యానికి గురి కాక త‌ప్ప‌దు.

బాబుపై ఇంత ఆగ్ర‌హం ప‌వ‌న్ కు ఎందుకు వ‌చ్చింది? నాలుగేళ్ల‌కు పైనే బాబును మోసిన ప‌వ‌న్‌.. ఇప్పుడెందుకు అంత‌గా విరుచుకుప‌డుతున్నారు. గ‌తంలో బాబు స‌ర్కారు చేసిన త‌ప్పుల విష‌యంలో చూసీ చూడ‌న‌ట్లుగా పోయిన ప‌వ‌న్‌.. క‌చ్ఛితంగా స‌మాధానం చెప్పాల్సిందేన‌న్న మాట‌ల‌కు సైతం స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారే త‌ప్పించి.. బాబు మీద విమ‌ర్శ‌లు చేసేందుకు ఇష్ట‌ప‌డే వారు కాదు.

ఇప్పుడేమో అందుకు పూర్తి రివ‌ర్స్ లో.. బాబు మీద ప్ర‌తి విష‌యంలో విమ‌ర్శ‌.. ఆరోప‌ణ‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా ఏపీ రాజ‌ధాని భూసేక‌ర‌ణ అంశంపై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్‌.. మ‌రిన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీని ఏమీ అన‌టం లేద‌ని ముఖ్య‌మంత్రి అంటున్నార‌ని.. గ‌తంలో టీడీపీని కూడా ఏమీ అన‌కున్నా బూతులు తిట్టార‌ని మండిప‌డ్డారు.

తానెప్పుడూ యూట‌ర్న్ తీసుకోలేద‌న్న ప‌వ‌న్‌.. బాబు మీద త‌న‌కు తొలిసారి న‌మ్మ‌కం పోయిన ఘ‌ట‌న గురించి చెప్పుకొచ్చారు. తాను పార్టీపెట్టిన త‌ర్వాత చంద్ర‌బాబు పిలిస్తే ఆయ‌న్ను క‌లిసేందుకు తాను వెళ్లాన‌ని.. ఆ సంద‌ర్భంగా ఆయ‌న కొన్ని సీట్లు ఇస్తామ‌ని చెప్పార‌న్నారు. ఆ విష‌యం మీద తాను ఏమీ చెప్ప‌క‌ముందే.. పేప‌ర్ల‌లో ఆ వార్త వ‌చ్చేసింద‌ని.. అప్ప‌టి నుంచి బాబుపై త‌న‌కు న‌మ్మ‌కం పోయింద‌న్నారు. వెంట‌నే టీడీపీకి న‌మ‌స్కారం పెట్టి వెళ్లిపోయాన‌న్నారు.

త‌న‌కు అనుభ‌వం లేద‌ని టీడీపీ నేత‌లు అంటున్నార‌ని.. మ‌రి.. చంద్ర‌బాబుకు అనుభ‌వం ఉందా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. మీరు.. రాజ‌కీయాల్లోనే పుట్టారా? రాజ‌కీయాల్లోకి రాగానే అనుభ‌వం రాదు.. కింద‌ప‌డ‌తాం.. దెబ్బ‌లు తింటాం.. త‌ఢాఖా చూపిస్తాం.. జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌న్నారు. మ‌రింత క్లారిటీ ఇస్తున్న ప‌వ‌న్‌.. గ‌తంలో త‌న‌కు లేని అనుభ‌వం గురించి.. బాబుకున్న అనుభ‌వం గురించి ఎందుకు చెప్పిన‌ట్లు. ఒక రోజు చెప్పే మాట‌ల‌కు.. మ‌రో రోజు చెప్పే మాట‌ల‌కు పొంత‌న లేకుంటే ఎలా ప‌వ‌న్‌?