Begin typing your search above and press return to search.
బీఆర్ఎస్, వైసీపీ ఫైట్ లోకి పవన్ కళ్యాణ్
By: Tupaki Desk | 17 April 2023 11:09 AM GMTతెలుగు రాష్ట్ర ప్రభుత్వాల లొల్లిలోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. కొద్దిరోజులుగా బీఆర్ఎస్ వర్సెస్ వైసీపీ నేతల మాటల యుద్ధం పతాకస్థాయికి చేరుతోంది.విశాఖ ఉక్కు నుంచి మొదలుపెడితే.. ఆంధ్రా ఓటర్లను తెలంగాణలోకి మారాలని హరీష్ రావు పిలుపునివ్వడం వరకూ ఇరు పార్టీల నేతలు నోరుపారేసుకుంటున్నారు. అయితే రెండు పార్టీల గేమ్ అనేవారు లేకపోలేదు. వైసీపీ, బీఆర్ఎస్ కావాలనే రెచ్చగొడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.. ఈ గొడవలోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఆసక్తి రేపింది.. తెలంగాణ ప్రజలను అమానించిన వైసీపీ నేతలను నిలదీస్తూ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ పవన్ లేవనెత్తారు. తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు బాధ కలిగిస్తే వ్యక్తిగతంగా మాట్లాడాలంటూ వైసీపీ నేతలకు హితవు పలికారు. .
-అసలు వివాదం ఏంటి?
తెలంగాణ మంత్రి హరీష్ రావు తాజాగా ఆంధ్ర ఓటర్లను తెలంగాణకు రావాలని.. అక్కడ ఏం లేదని.. కనీసం విశాఖ ఉక్కును కూడా కాపాడుకోలేని ఆంధ్ర నేతలు పాలన వైఫల్యాలను ఎండగట్టారు. ఆంధ్రాలో ఉంటే బతకలేరు అని.. తెలంగాణలో ఓటు హక్కు నమోదు చేసుకోవాలని మంత్రి హరీష్ రావు అన్నట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి..
-వైసీపీ మంత్రులు ఫైర్
దీనికి వైసీపీ మంత్రులు సీదరి అప్పలరాజు , మాజీ మంత్రి పేర్ని నాని సహా గట్టి కౌంటర్ ఇచ్చారు. హరీష్, కేసీఆర్, కేటీఆర్ లను ఉతికి ఆరేశారు. తెలంగాణలో ఏం లేదని.. ఎక్కడికెళ్లినా రోడ్లు సరిగా లేవని.. ముందు మీ దుకాణం బాగుచేసుకున్నా ఆంధ్రా గురించి మాట్లాడాలని.. ఆంధ్రాను అవమానించేముందు మీరు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలంటూ కౌంటర్ ఇచ్చారు.
-ఏపీ మంత్రులను తప్పుపట్టిన పవన్
జనసేనాని పవన్ కళ్యాణ్ ఆంధ్ర వైసీపీ మంత్రుల తీరును ఖండించారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. తెలంగాణ మంత్రి బాధ కలిగించేలా మాట్లాడి ఉంటే.. వ్యక్తిగతంగా స్పందించాల్సి ఉండేదన్నారు. మధ్యలో అక్కడ ప్రజలు ఏంచేశారని ప్రశ్నించారు. ప్రజలకు ఆపాదిస్తూ తెలంగాణ ప్రజలను తిట్టటం..తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ తినేలా వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. వైసీపీ మంత్రులు అదుపు తప్పి మాట్లాడితే సీఎం స్పందించాలన్నారు. తెలంగాణలో బొత్సా లాంటి వారికి వ్యాపారాలు లేవా అంటూ పవన్ ప్రశ్నించారు. ఇటువంటి కామెంట్స్ సరికాదన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలకు విఘాతం కలిగించేలా కామెంట్స్ దారుణమన్నారు.
ఏపీ మంత్రుల వ్యాఖ్యలను తనకు వ్యక్తిగతంగా మనస్థాపం కలిగించాయని చెప్పుకొచ్చారు.వ్యాఖ్యలు చేసిన వారిని మాత్రమే ఉద్దేశించి మాట్లాడాలని..తెలంగాణ ప్రజలను కలిపి తిట్టవద్దని పవన్ సూచించారు. ఈ పరిణామాలపై వైసీపీ సీనియర్లు స్పందించాలని డిమాండ్ చేసారు. ఏపీ మంత్రులు, నేతలకు తెలంగాణలో వ్యాపారాలు లేవా అని పవన్ ప్రశ్నించారు. బొత్సా లాంటి వారికి తెలంగాణలో మొన్నటి వరకు కేబుల్ వ్యాపారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మంత్రులు అదుపు తప్పి మాట్లాడితే సీఎం స్పందించాలన్నారు.
మొత్తంగా బీఆర్ఎస్, వైసీపీ వార్ లోకి అనూహ్యంగా పవన్ ఎంట్రీ ఇచ్చారు. వారిద్దరి సెంటిమెంట్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల తరుఫున నిలబడ్డారు. వారిని ఏం అనవద్దని.. అవసరం అనుకుంటే బీఆర్ఎస్ మంత్రిని తిట్టుకోండి అంటూ పవన్ హితవు పలికారు.