Begin typing your search above and press return to search.
పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్.. సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 5 April 2023 4:05 PM GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజులపాటు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్ర మంత్రులు మురళీధరన్, గజేంద్ర సింగ్ షెకావత్ లను కలసిన సంగతి తెలిసిందే. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే జనసేన, బీజేపీల లక్ష్యమని పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలో పవన్ ఢిల్లీ టూరు పై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. జనసేన–బీజేపీ కలిసి ముందుకెళ్తాయి.. కలిసే ఉన్నాం అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసే ప్రజా వ్యతిరేక విధానాల పై జనసేన–బీజేపీ కలిసి పోరాడతాయని వెల్లడించారు.
చంద్రబాబుతో పవన్ కల్యాణే కాదు.. తాను కూడా వివిధ సందర్భాల్లో భేటీ అయ్యానని సోము వీర్రాజు తెలిపారు. రాజకీయాల్లో వివిధ పార్టీల నేతలు కలవడమనేది సర్వ సాధారణమన్నారు. చంద్రబాబుతో కలిసినంతమాత్రాన ఎవ్వరూ కంగారు పడాల్సిన పనిలేదని సోము వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. ఆలయాల పై దాడులు పెద్ద ఎత్తున జరిగాయని సోము వీర్రాజు ఆరోపించారు. ఏపీలో హైంధవ ధర్మం అపహాస్యం పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిరంగిపురంలో వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదని ధ్వజమెత్తారు. హిందూమతం పై దాడులు జరుగుతోంటే ఒక్క అరెస్టైనా జరిగిందా..? అని నిలదీశారు. ఏపీలో ఎంతో మందిని అరెస్ట్ చేస్తున్నారు.. కానీ, దేవాలయాల పై దాడులు చేస్తున్న వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం లేదని సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీరు మారకుంటే.. కపిల తీర్థం నుంచి రామ తీర్థం వరకు యాత్ర చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్టును సోము వీర్రాజు ఖండించారు. పరీక్ష లీకేజీ బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యమని తెలిపారు. పేపర్ లీకేజీ తో బండి సంజయ్ కు ఏం సంబంధం ఉంటుంది..? అని నిలదీశారు. అవినీతి సంపదతో దేశ రాజకీయాలు నడిపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్, బీఆర్‌ఎస్ పార్టీలు తెరమరుగు కావడం ఖాయమన్నారు.
కాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులకు ప్రాధాన్యత ఇస్తోందని సోము వీర్రాజు తెలిపారు. దేశానికి జగ్జీవన్ రాం ఎన్నో సేవలందించారని కొనియాడారు. ఆయన.. ఉప ప్రధానిగా దేశానికి సేవలందించారని గుర్తు చేశారు. దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు జగ్జీవన్ రాం ఆహార మంత్రిగా చేశారని గుర్తు చేశారు. 1977లో జగ్జీవన్ రామ్‌ను దేశ ప్రధానిని చేయాలని ఆనాటి జనతా పార్టీ ప్రయత్నించిందని పేర్కొన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.