Begin typing your search above and press return to search.
మీడియా అంతా మీదేగా బాబూ- పవన్
By: Tupaki Desk | 6 Nov 2018 11:38 AM GMTపవన్ కళ్యాణ్ తెలుగుదేశం మీద ఆగ్రెసివ్‌గానే వెళ్తున్నట్టుంది. చంద్రబాబు టెక్నాలజీలో కింగ్... పాలనలో స్ట్రాంగు అని చెప్పే టీడీపీ అభిమానులు పరువు తీశాడు పవన్ కళ్యాణ్. తిత్లీ తుపాను విషయంలో జనసేన అధినేత ఏ మాత్రం స్పందించలేదని - కనీసం ప్రధానికి లేఖ కూడా రాయలేదని విమర్శించారు. దీనిపై స్పందించిన జగన్ చంద్రబాబుతో పాటు నిన్న లోకేష్ ట్వీట్ కు కూడా పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు గారు అబద్ధాలు మాట్లాడతారు అని చెప్పడానికి సాక్ష్యమే నిన్నటి ఆరోపణ అన్నట్లుంది పవన్ స్పందన. ఉత్తరాంధ్రకు తుపాను సాయం కోరుతూ మోడీకి పవన్ కళ్యాణ్ రాసిన లేఖను బయటపెట్టారు పవన్ కళ్యాణ్. అయితే, మీడియా విషయంలో అంత వేగంగా ఉండే చంద్రబాబుకు ఒక పార్టీ ప్రధాని రాసిన లేఖ విషయంలో అప్ డేట్ కూడా తెలియకపోవడం విశేషం. అంటే... రాయలేదని - రాశారని స్పస్టంగా తెలియదు. ఏదో ఆరోపణ చేయాలి కాబట్టి చేయాలన్నట్లుంది చంద్రబాబు. దీన్ని బట్టి చంద్రబాబు ఎంత అవలీలగా అబద్ధాలు ఆడుతారో పవన్ ద్వారా నిరూపితం అయ్యింది.
ఈ సందర్భంగా పవన్ మరిన్నికామెంట్లు చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా అంతే మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఏ వార్తలు రావాలి, ఏ వార్తలు రాకూడదు అనేది మీరే డిసైడ్ చేస్తున్నారు. జనసేన ఏం చేస్తుందో జనాలకు తెలియకుండా చేస్తున్నారు అంటూ చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు చేశారు. మరో ట్వీట్ లో నిన్న లోకేష్ అడిగిన దానికి కౌంటర్ ఇచ్చారు. అవినీతికి ఆధారాలు కావాలా... ఇది చాలదా అంటూ ఈనాడులో వచ్చిన *మట్టైనా మనదేనోయ్* కథనం క్లిప్పింగును జత చేశారు పవన్. మొత్తానికి తండ్రీకొడుకులను పవన్ ఒకాట ఆడుకున్నారు.