Begin typing your search above and press return to search.

గురివింద మాదిరి మాట్లాడుతున్న ప‌వ‌న్

By:  Tupaki Desk   |   15 Jan 2019 5:28 AM GMT
గురివింద మాదిరి మాట్లాడుతున్న ప‌వ‌న్
X
త‌న కింద న‌లుపు గురించి ఎంత మాత్రం మాట్లాడ‌ని గురివింద‌.. లోకం న‌లుపు గురించి అదే ప‌నిగా మాట్లాడుతుంది. త‌న రాజ‌కీయ స్వార్థం కోసం ఎంత‌కైనా అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ధోర‌ణి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ లో అంత‌కంత‌కూ పెరుగుతోంది. త‌న‌పై ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన విమ‌ర్శ‌ల‌కు ధీటుగా బ‌దులివ్వాల్సిన ప‌వ‌న్‌.. అందుకు భిన్నంగా చేస్తున్న వ్యాఖ్య‌లు అత‌క‌ని విధంగా ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

వైఎస్ జ‌గ‌న్ కు కేసీఆర్ మ‌ద్ద‌తు ఉంద‌ని.. కేసీఆర్‌కు జ‌గ‌న్ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లుగా ప‌వ‌న్ చేస్తున్న ప్ర‌చారం చూస్తే.. గురివింద చ‌టుక్కున గుర్తుకు రాక మాన‌దు. కేసీఆర్ ను.. ఆయ‌న కుమార్తె క‌విత‌ను ఉద్దేశించి గ‌తంలో ఘాటైన వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ కు.. తెలంగాణ‌లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌న్న ఆలోచ‌న ఎందుకు క‌ల‌గ‌లేదు? రెండు తెలుగు రాష్ట్రాలు త‌న‌కు ముఖ్య‌మ‌న్న‌ట్లు చెప్పే ప‌వ‌న్‌.. తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌.. ఎవ‌రికి ఓటు వేయాల‌న్న విష‌యాన్ని చెబుతూ.. గులాబీ బాస్ వైపున‌కు మొగ్గిన తీరు ప‌లువురిలో ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఒక‌ప్పుడు గులాబీ బాస్ మీద ఎంత మాట ప‌డితే అంత మాట అనేందుకు ఏ మాత్రం వెనుకాడ‌ని ప‌వ‌న్‌.. అందుకు భిన్నంగా ఎందుకు రియాక్ట్ అయిన‌ట్లు? ఆయ‌న అలా మాట్లాడ‌టం వెనుక అస‌లు కార‌ణం ఏమిట‌న్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ప‌వ‌న్ ఎవ‌రు?... అంటూ అమాయ‌కంగా కేసీఆర్ ప్ర‌శ్నించి ఎంత ఎట‌కారం చేయాలో అంత ఎట‌కారం చేసిన వైనాన్ని ప‌వ‌న్ కు ఇప్పుడు ప‌ట్ట‌టం లేదు. తెలంగాణ‌లో అభివృద్ధి గురించి గొప్ప‌లు చెబుతున్న ప‌వ‌న్ తీరు చూస్తే.. టీఆర్ ఎస్ అధినేత మీద అంత అభిమానం ఎందుకున్న ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌టం లేదు.

కేసీఆర్ తో పాటు.. కేటీఆర్ తో ప్రైవేటు సంభాష‌ణ‌ల్ని చేసే ప‌వ‌న్ కు కేసీఆర్ స‌ర్కారు లోపాలు ఏ మాత్రం క‌నిపించ‌ని ప‌రిస్థితి. ఇలాంటి పెద్ద మ‌నిషి జ‌గ‌న్ గురించి వ్యాఖ్య‌లు చేయ‌టం.. ఆయ‌నపై ఆరోప‌ణ‌లు చేయ‌టం చూస్తే.. ప‌వ‌న్ ఎంత పెద్ద గురివింద అన్న‌ది ఇట్టే తెలుస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.