Begin typing your search above and press return to search.
జగన్ కి గౌరవం ఇవ్వనంతే... పవన్ సంచలనం
By: Tupaki Desk | 10 July 2023 9:12 AM GMTసీఎం పీఠం అంటే రెస్పెక్ట్ ఉందని, కానీ ఆ పదవిలో కూర్చున జగన్ మాత్రం సీఎం పదవికి అనర్హుడు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త భాష్యం చెప్పారు. తాను ఇప్పటిదాకా సీఎం పదవిని గౌరవించి జగన్ రెడ్డి గారూ అని మాట్లాడుతూంటే ఆయన మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు.
రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని తన తల్లి, భార్యను తన పిల్లలను లాగుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా జగన్ వక్రీకరించి వెకిలిగా మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఈ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి అవసరం లేదని, అలాగే వైసీపీ అంతకంటే అవసరం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఏపీకి 2024లో వైసీపీ లేని పాలనను తీసుకుని వద్దామని అన్నారు. సీఎం అంటే ఎక్కువ కాదని, ఆయన కూడా మనలో ఒకరని పవన్ చెప్పారు. ప్రజలు కట్టే పన్నులకు కాపలా ఉంటూ మంచిగా పాలన చేయాలని ఆయన అన్నారు. కానీ ఈ ముఖ్యమంత్రి పాలన అలా చేయకపోవడం వల్లనే తాను అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.
రాష్ట్ర ఖజానా పది లక్షల కోట్ల రూపాయలని అంత పెద్ద మొత్తం సొమ్ముని ఎలా ఖర్చుపెట్టారో ప్రజలకు జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని పాన్ డిమాండ్ చేశారు మనకు చెప్పాలి. అలాగే జగన్ లక్షా 18 వేల కోట్ల రాష్ట్ర పేరిట అప్పు తీసుకుని వాటిని దేనికి ఖర్చు చేశారో ప్రజలకు లెక్క చెప్పాలని కూడా పవన్ డిమాండ్ చేశారు. 22 వేల కోట్లు లిక్కర్ బాండ్లపై అప్పు తీసుకుని ఆ డబ్బు ఏం చేశారని, అలాగే రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డబ్బు ఏం చేశావో జగన్ ఆయన మంత్రులు ప్రజలకు జవాబు చెప్పాలని కోరారు.
ఏపీలో ప్రజా పాలన రావాలని పవన్ అన్నారు. మరో వైపు తాను విజయం సాధిస్తానో లేదో తెలియదని, అయినా అన్నీ వదులుకుని పోరాటం చేస్తున్నాను అన్నారు. తనకు రాజకీయం సరదా కాదని బాధ్యత అని ఆయన అన్నారు. తాను అన్నీ వదులుకుని ప్రజలలోకి వచ్చి తన కుటుంబం మీద వచ్చే నిందలు ఎందుకు మోయాలని ప్రశ్నించారు.
తాను ప్రజల బాధ చూడలేకనే రాజకీయాల్లోకి వచ్చాను అని ఆయన అన్నారు. ఏపీలో వైసీపీ పాలన కూలదోయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. రాజకీయాల్లో అవమానాలు అన్నీ భరించేది ప్రజల కోసమే అన్నారు. హెలో ఏపీ బై బై వైసీపీ అన్నది ప్రజలు జనసేనకు ఇచ్చిన నినాదం అన్నారు. ఏపీ ప్రజలు జగన్ కి బానిసలు కాదని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. మొత్తానికి రెండవ విడత పాదయాత్ర మొదటి రోజునే జగన్ మీద గతానికంటే కూడా మరింత ఫైర్ తో పవన్ విరుచుకుని పడ్డారని చెప్పాలి.