Begin typing your search above and press return to search.

సినిమాల్లోకి రీ ఎంట్రీ పై ప‌వ‌న్ సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   5 Nov 2019 5:18 AM GMT
సినిమాల్లోకి రీ ఎంట్రీ పై ప‌వ‌న్ సంచ‌ల‌నం
X
గ‌త వారం రోజులుగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమా రీ ఎంట్రీ పై జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో ప‌వ‌న్ సినిమాల్లో కి వెళుతున్నార‌న్న వార్త‌లు వ‌స్తే ఆ పార్టీ నేత‌లు తీవ్రంగా ఖండించే వారు. అంతెందుకు తాను ఇక సినిమాల్లో న‌టించ‌ను అని.. ఫుల్ టైం పొలిటిషీయ‌న్‌ గా ఉంటాన‌ని ప‌వ‌న్ సైతం చెప్పేవారు. ఏపీలో జ‌న‌సేన ఘోరంగా ఓడిపోయింది... ఐదు నెల‌లు అయిపోయాయి... క‌ట్ చేస్తే ఇప్పుడు ప‌వ‌న్ సినిమాల్లో న‌టించే విష‌యంలో ఆయ‌న వాయిస్ పూర్తిగా మారుతున్న‌ట్టే క‌నిపిస్తోంది.

ఆయ‌న విశాఖ వేదిక‌గా తాజాగా నిర్వ‌హించిన లాంగ్ మార్చ్‌ పై వైసీపీ తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ త‌న‌ పై వైసీపీ చేస్తోన్న విమ‌ర్శ‌ల‌ పై స్పందించారు. నాకు తెలిసింది సినిమా ఒక్క‌టే.. ఇప్పుడున్న రాజ‌కీయ నేత‌లు రాజ‌కీయాల కోసం వ్యాపారాలు మానుకున్నారా ? అని ప్ర‌శ్నించారు. ఇక మంత్రి అవంతి శ్రీనివాస్‌ ను ఉద్దేశించి అవంతి గారికి కాలేజ్‌లు ఉన్నాయి ? వాటిని మూసేసి ఆయ‌న రాజ‌కీయాల్లో లేరు క‌దా ? అన్నారు.

ఇక జ‌గ‌న్ గారికి జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్‌, భార‌తి సిమెంట్స్ లాంటి వ్యాపారాలు లేవా ? అని ప్ర‌శ్నించారు. ఇక మీకు సినిమాల్లోకి మ‌ళ్లీ వ‌చ్చే ఉద్దేశం ఉందా ? అన్న ప్ర‌శ్న‌కు సినిమాలు చేస్తానో ? లేదో ? త‌న‌కే తెలియ‌ద‌ని.. అయితే నిర్మాత‌ గా మాత్రం వ్య‌వ‌హ‌రిస్తాన‌ని పవన్ స్పష్టం చేశారు. ఇక ప‌వ‌న్ ఇప్ప‌టికే కొంద‌రు నిర్మాత‌ల ద‌గ్గ‌ర అడ్డాన్స్‌లు తీసుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. రాజ‌కీయంగా కూడా ప‌వ‌న్ ఇప్పట్లో చేయ‌డానికేం లేదు. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ ప‌వ‌న్ సినిమాల్లోకి వ‌చ్చే రోజు ఎంతో దూరంలో లేద‌నే తెలుస్తోంది.