Begin typing your search above and press return to search.

అమెజాన్ ప్రైమ్ స‌బ్ స్క్రైబ్ చేశావా ప‌వ‌న్ ?

By:  Tupaki Desk   |   27 Nov 2018 10:37 AM GMT
అమెజాన్ ప్రైమ్ స‌బ్ స్క్రైబ్ చేశావా ప‌వ‌న్ ?
X
రోజు రోజుకీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న రాజ‌కీయ అవ‌గాహ‌న రాహిత్యాన్ని ప్ర‌ద‌ర్శించుకుంటున్నారు. ఒక్క ప‌ద‌వీ కాంక్ష త‌ప్ప ఇత‌ర ఏ ల‌క్ష్య‌మూ లేకుండా ముందుకు సాగుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆవేశంతో ఊగిపోతూ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో త‌న ప్ర‌సంగాల‌తో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడుతున్నారు. ఉద్దానం పోతే ఆ ఊరి కోస‌మే ప్ర‌పంచం బ‌త‌కాలంటారు. కోన‌సీమ‌కు వెళ్తే ఆ పౌరుషం ఉందంటాడు... అనంతపురం వెళ్తే క‌ర‌వు చూసి ఏడుపొస్తుంది అంటాడు... ఒక‌దానికీ ఒక‌దానికి పొంత‌న ఉండ‌దు. ఇప్ప‌టికే అంద‌రి బాధ‌ల‌కు క‌రిగిపోయి 8 నియోజ‌క‌వ‌ర్గాల్లో తానే పోటీ చేసి మీ క‌ష్టాలు తీరుస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ అర్థ‌ర‌హిత‌మైన కామెంట్లు చేసి ఈరోజు జ‌నాల‌కు చుల‌కన అయిపోయారు.

తాజాగా ఆయ‌న రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ప‌ర్య‌టించారు. ఎప్ప‌టిలాగే చంద్ర‌బాబు - జ‌గ‌న్‌ పై విమ‌ర్శ‌ల దాడికి దిగారు. అయితే, ఈసారి ఓ ట్విస్ట్ ఉంది. చంద్ర‌బాబు నుంచి జ‌గ‌న్ ఏపీలోని ప్ర‌తి ప్రాజెక్టులో క‌మీష‌న్ తీసుకుంటున్నాడ‌ట. ఆ క‌మీష‌న్ జ‌గ‌న్‌ కు చేరుతుందో లేదో చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌పుడు ఆరాతీస్తున్నార‌ట‌. ప‌వ‌న్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌కు న‌వ్వాలో ఏడ‌వాలో తెలియ‌క జ‌నం అయోమ‌యానికి గుర‌యితే ట్రోల‌ర్స్ మాత్రం పండ‌గ చేసుకుంటున్నారు.

ఏం ప‌వ‌న్‌... అమెజాన్ ప్రైమ్ స‌బ్ స్క్రైబ్ చేశావా? మొత్తం సినిమా అంతా చూశావా? లేక ఆ సీన్ మాత్ర‌మే చూశావా అంటూ సెటైర్లు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఏంటా సినిమా అనుకుంటున్నారా? భ‌ర‌త్ అనే నేను సినిమాలో ఒక సీను ఉంటుంది. ప్ర‌కాష్ రాజ్ సీఎంకి మిత్రుడు. కానీ ప్ర‌తిప‌క్షంతో కుమ్మ‌క్క‌యి ఉంటాడు. దీని గురించి ఆ సినిమాలో పాత్ర కామెంట్ చేస్తూ... ఇది డెడ్లీ కాంబినేష‌న్ అంటుంది. స‌రిగ్గా ప‌వ‌న్ ఆ సీన్‌ కే క‌నెక్ట‌యిన‌ట్టున్నాడు. అందుకే ఇదేదో బాగుందే... ఈ ఆరోప‌ణ చేస్తే జ‌గ‌న్‌ - బాబు ఒకే దెబ్బ‌కు విమ‌ర్శించొచ్చు అని థింక్ చేశాడో ఏమో మ‌రి... చాలా చిత్రంగా ఆ సినిమాటిక్ డైలాగ్‌ ను త‌న ప్రసంగంలో వ‌దిలారు. ఏపీలో ప‌వ‌న్ చేసిన ఈ వ్యాఖ్య‌ను వైసీపీ నేత‌లే కాదు... టీడీపీ నేత‌లు కూడా న‌మ్మ‌రు. ఇట్లాగే సాగుతాయి ప‌వ‌న్ ఆలోచ‌న‌ల‌న్నీ.

పాపం ఆయ‌న‌లోని ఈ ఫైర్ చూసే ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ ... ప‌వ‌న్ నాకు గ‌ట్టి తమ్ముడు అవుతాడు. రా ప‌వ‌న్‌. నా వ‌ద్ద‌కు రా.. నేను నిన్ను సీఎంను చేస్తాను... అని ఏకంగా దైవ ప్రార్థ‌న చేశారు. ఏపీ ప్ర‌జ‌ల క‌ర్మ కాక‌పోతే... ఇవ‌న్నీ వినాల్సి రావ‌డం ఏంటో!