Begin typing your search above and press return to search.

మీ బాల‌య్య లాగా బూతులు తిట్టాలా?

By:  Tupaki Desk   |   3 Nov 2018 12:17 PM GMT
మీ బాల‌య్య లాగా బూతులు తిట్టాలా?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ త‌న విమ‌ర్శ‌ల దూకుడు పెంచుతున్నారు. బెజవాడ నుంచి రైలులో బయల్దేరిన పవన్ కల్యాణ్ టీమ్‌ తుని వరకు ప్రయాణం చేయనున్న సంగ‌తి తెలిసిందే.ఈ క్ర‌మంలోలో తుని చేరిన సంద‌ర్భంగా ప‌వ‌న్ ప్ర‌సంగిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ పార్టీలు త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తూ పోవ‌డం వ‌ల్ల జ‌న‌సేన అవ‌స‌రం వ‌చ్చిందన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ - బీజేపీకి మ‌ద్ద‌తుగా నిలిచాన‌ని అయితే, వారు స‌రైన‌ రీతిలో ప‌నిచేయ‌క‌పోతే ప్ర‌శ్నిస్తాన‌ని చెప్పిన ప్ర‌కారం అదే ప‌ని చేస్తున్నాన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెల్ల‌డించారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని తాను ప్ర‌శ్నించ‌డం లేద‌ని స‌రైన రీతిలో నిల‌దీయ‌డం లేద‌ని టీడీపీ నేత‌లు చేస్తున్న కామెంట్లపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఒరేయ్ తురేయ్ అనాలా..ప్ర‌ధాన‌మంత్రిని అమ్మా ఆలి అనాలా మీ బాల‌కృష్ణ గారిలా? ధ‌ర్మ‌పోరాట దీక్ష అని చెప్పి - ధూషించ‌కూడ‌ని తిట్టును బాల‌కృష్ణ గారు తిట్టారు. అలా తిట్టాలా? అంటూ ప‌వ‌న్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. అదే స‌మ‌యంలో బాల‌య్య‌ను నేరుగా పేరుపెట్టి తొలిసారి టార్గెట్ చేశారు. గ‌తంలో బాల‌కృష్ణ ప్ర‌దాన‌మంత్రిపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇదిలాఉండ‌గా...కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - ఏపీ సీఎం చంద్రబాబు భేటీపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీడీపీ - కాంగ్రెస్ కలయిక చంద్రబాబు ఉనికి కోసమేన‌ని అన్నారు. చంద్రబాబు పదవి కాపాడుకోవడం కోసమే ఢిల్లీ బాట పట్టారని ఎద్దేవా చేశారు. నిన్న ఢిల్లీలో చంద్రబాబు చూపింది సినిమా విడుదలకు ముందు వచ్చే ట్రైలర్ లాంటిదన్న జనసేనాని... కానీ, చంద్రబాబు సినిమా ఫ్లాప్ అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలయిక చూస్తాంటే... ఆయన ఎక్కడ మొదలయ్యారో... ఎక్కడికే చేరుకున్నట్లో అనిపిస్తోందన్నారు.