Begin typing your search above and press return to search.
పవన్ స్వయంగా ప్రచారం చేసినా ఆమె ఓటమి..కారణం అదేనట!
By: Tupaki Desk | 15 March 2021 9:50 AM GMTఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ అభ్యర్థిని బలపరిచారు. ఆమెకోసం ప్రత్యేకంగా వీడియో సందేశాన్ని ఇచ్చారు. అయినా ఆమె ఓటమి పాలైయ్యారు. దీనితో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...అమలాపురం 10వ వార్డు జనసేన అభ్యర్థిని ముత్యాల మణికుమారి ఓటమి చెందారు.
ఆమెకు కేవలం 153 ఓట్లు మాత్రమే లభించడం చర్చనీయాంశమైంది. పవన్‌కల్యాణ్ అమరావతిలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో 70 ఏళ్ల మణికుమారి పోటీ చేస్తుందని, ఆమె విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే జనసేన పార్టీ శ్రేణులు పరోక్షంగా వైసీపీ అభ్యర్థి విజయానికి సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలోనే మణికుమారి ఓటమి పాలయ్యారు. కొందరు సీనియర్ నాయకులతో పాటు పార్టీలో ఉన్న కొందరు నాయకులపై జన సైనికులే బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే .. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన అదినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బెదిరింపులతోనే వైసీపీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిందని ఆయన అన్నారు. ఓటు వెయ్యకపోతే సంక్షేమ పథకాలు నిలిపేస్తామని బెదిరించారని.. ప్రజలకు భరోసానిచ్చి వైసీపీ ఓఠ్లు సాధించలేదని.. కడుపుమీద కొట్టి తిండి లాక్కుంటామని బెదిరించి ఓట్లు సాధించిందని ఆరోపించారు. వైసీపీ బెదిరింపులకు బలంగా బదులిస్తామని పవన్ స్పష్టం చేశారు.
ఇక మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ప్రదర్శన వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఐదు వార్డులను కైవసం చేసుకొని రెండోస్థానంలో నిలిచింది. ఓ దశలో వైసీపీకి గట్టిపోటినిచ్చిన జనసేన ఆతర్వాత వెనుకబడింది. గ్రేటర్ విశాఖమున్సిపల్ కార్పొరేషన్ లో నూ నాలుగు స్థానాల్లో గెలిచి ఉనికిని చాటుకుంది. ఒంగోలు కార్పొరేషన్ లో ఒకటి గుంటూరు కార్పొరేషన్ లో ఒక డివిజన్ ను జనసేన సొంతం చేసుకుంది. ఇక కడప జిల్లా మైదుకూరులో జనసేన ఒక్కవార్డులో విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు జనసేన అభ్యర్థే ఇక్కడ కీలకంగా మారారు. మరోవైపు ప్రకాశం జిల్లా జంగారెడ్డిగూడెంలోనూ జనసేన ఒక వార్డును కైవసం చేసుకుంది.మొత్తమ్మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 15 వార్డుల లోపే జనసేన విజయం సాధించినట్లు తెలుస్తోంది