Begin typing your search above and press return to search.

పనితీరు నచ్చకపోతే సీఎం గా తప్పుకుంటా పవన్ బోల్డ్ స్టేట్మెంట్

By:  Tupaki Desk   |   15 Jun 2023 9:56 PM GMT
పనితీరు నచ్చకపోతే సీఎం గా తప్పుకుంటా పవన్ బోల్డ్ స్టేట్మెంట్
X
నన్ను నమ్మండి ఒక్క చాన్స్ ఇవ్వండి, నా పనితీరుని బేరీజు వేయండి, సీఎం గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల వ్యవధిలో కనుక నేను మీ మెప్పు పొందకపోయినా పనితీరు నచ్చకపోయినా ఆ వెంటనే నేనే స్వచ్చందంగా తప్పుకుంటా. అంతే కాదు నన్ను రీకాల్ చేసే అధికారం కూడా మేకే ఇస్తున్నా అంటున్నారు పవన్.

ఇది సరికొత్త రాజకీయ నినాదమే. అంతే కాదు సరికొత్త రాజకీయ విధానం కూడా. ఇప్పటిదాకా అయిదేళ్ల పాటు కుర్చీని పట్టుకుని ఉంటామని పదే పదే తమకే చాన్సులు ఇవ్వాలని కోరుతున్న నేతలనే చాలామంది చూశారు. అయితే పవన్ మాత్రం తాను అలాంటి వాడిని కాను అంటున్నారు. తాను రాష్ట్రం కోసం ఉన్నాను అని చెబుతున్నారు.

బాధ్యతగా పనిచేస్తాను అని అంటున్నారు. నన్ను నమ్మి 2024, 2029 ఎన్నికలను చూడండి అని పవన్ కోరుతున్నారు. కాకినాడ జిల్లా చేబ్రోలులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మేర్కు ఈ సంచలన కామెంట్స్ చేశారు. సెరీ కల్చర్ రైతులతో నేత కార్మికులతో పవన్ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఒక్క చాన్స్ ఇస్తే కనుక బంగారు అంధ్రప్రదేశ్ గా మారుస్తాను అని హామీ ఇచ్చారు. అలా కనుక చేయని పక్షంలో తానే సీఎం సీటు నుంచి తప్పుకుంటాను అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చాలా మందిని ఆలోచింపచేసేలా ఉంది. నిజానికి ఒక నాయకుడి పని తీరు మీద అంచనా వేసుకుని చాన్స్ ఇస్తారు. కానీ దానికి విరుద్ధంగా ఆయన పనిచేస్తున్నపుడు ఆయన్ని రీకాల్ చేయాలన్న విధానం ఉండాలని చాలా కాలంగా మేధావి వర్గం నుంచి డిమాండ్ వస్తోంది.

అయితే రాజకీయ నాయకులు మాత్రం దాని మీద ఎపుడూ పెద్దగా స్పందించవు. కానీ ఫశ్ట్ టైం పవన్ కళ్యాణ్ ఆ విధానానికి మద్దతు ప్రకటించారు. తన పనితీరే కొలమానంగా తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే తాను తప్పుకుంటాను అని చెబుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ణి జనాలు ఎన్నుకుంటారా. ఆయన బోల్డ్ నెస్ రాజకీయాల్లో పనికి వస్తుందా, పదవీ వ్యామోహంతో ఉన్న పాలిటిక్స్ లో పవన్ లాంటి వారి నిజాయతీ పనికి వస్తుందా అన్నది కూడా చర్చగా ఉంది.

ఏది ఏమైనా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వెనక పవన్ లోని చిత్తశుద్ధి ఏపీ అంటే ఆయనకు ఉన్న కమిట్మెంట్ కూడా కచ్చితంగా తెలుస్తున్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రకంగా మంచి ఆలోచనతోనే రాజకీయాల్లో తన దైన శైలిని కొనసాగిస్తున్నారు అని అంటున్నారు. అయితే పవన్ సీఎం పదవి అంటున్నారు అంటే ఆయన సోలోగా పోటీ చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.