Begin typing your search above and press return to search.
తానా వెళ్లే విషయంలో తేల్చుకోని పవన్!
By: Tupaki Desk | 14 Jun 2019 6:20 AM GMTఎన్నికల్లో దారుణ పరాజయం అనంతరం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తాను స్వయంగా బరిలోకి దిగిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయిన తీరు షాకింగ్ గా మారింది. అధినేత హోదాలో ఓటమిని ఎదుర్కొన్న ఆయన.. తానిక రాజకీయాలకే తన సమయాన్ని పూర్తిగా వెచ్చిస్తానని స్పష్టం చేశారు.
ఓటమి అనంతరం.. ఆ షాక్ నుంచి తేరుకునే ప్రయత్నంలో భాగంగా పార్టీ మీటింగ్స్ ను వరుస పెట్టి నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనకు తానా నుంచి ఇన్విటేషన్ వచ్చింది. జులై 4 నుంచి ఆరు వరకు వాషింగ్టన్ డీసీలో జరిగే తానా సభలకు హాజరు కావాలంటూ జనసేనానికి ఆహ్వానాన్ని పంపారు. ఈ విషయంపై వెళ్లాలా? వద్దా? అన్న విషయంపై పవన్ తేల్చుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది.
తానాలో చీఫ్ గెస్ట్ గా హాజరయ్యే విషయంపై పార్టీలో భిన్నాభిప్రాయం ఉన్నట్లు చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన తానాకు హజరుకావటం నెగిటివ్ అవుతుందన్న మాటను చెబుతున్నారు. టీడీపీతో అంతర్గతంగా చేసుకున్న ఒప్పందంలో భాగంగానే ఎన్నికల బరిలోకి పవన్ ఒంటరిగా దిగారని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకు చీల్చటమే లక్ష్యమన్న మాట వినిపించింది. ఈ ప్రచారం కూడా పవన్ కు తీవ్ర నష్టాన్ని కలిగించింది.
ఇలాంటివేళలో.. తానా సభలకు వెళ్లటం అంత మంచిది కాదన్న మాట పార్టీ వర్గాల నోటి నుంచి వినిపిస్తున్నాయి. ఈ సభలకు వెళ్లటం ద్వారా టీడీపీతో ఉన్న లోగుట్టు అనుబంధాన్ని తెర మీదకు తెచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు. ఇదే కాకుండా ఎన్ ఆర్ ఐలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే విషయంలో పవన్ ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందన్న మాట వినిపిస్తోంది. అయితే..అన్ని వర్గాల్ని కలుపుకుపోయే విషయంలో పవన్ మిగిలిన వారికి భిన్నంగా ఉంటారన్న పాజిటివ్ కోణం తానా సభలకు హాజరైతే ఉంటుందన్న మాట వినిపిస్తోంది. మరి.. పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.