Begin typing your search above and press return to search.
ఎర్రదళంపై గుర్రుమంటున్న జనసేన!
By: Tupaki Desk | 1 April 2018 6:43 AM GMTపవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీ.. వచ్చే ఎన్నికల్లో స్వతంత్రగానే పోటీచేస్తుందని.. ఒంటరిగా బరిలోకి దిగి, తెలుగుదేశం- వైకాపాలతో తలపడుతుందని... ఇప్పటిదాకా పవన్ మాటలను బట్టి ప్రజలంతా అనుకుంటూ ఉన్నారు. అయితే తాజాగా సీపీఐ నాయకుడు రామకృష్ణ.. వెల్లడిచేసిన విషయం జనసేనలో ప్రకంపనాలు పుట్టిస్తోంది. జనసేన- వామపక్షాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి.. వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ విషయం నిజం కావచ్చు.. కాకపోనూ వచ్చు.. కానీ.. ఇలాంటి విషయాలను అధికారికంగా ప్రకటించాల్సినది ఎవరు? తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కదా...? మరి సీపీఐ రామకృష్ణ ఆ విషయాన్ని తానే ప్రకటించేసి.. ఈ కూటమి ఆధ్వర్యంలో అనంతపురంలోనే తొలి బహిరంగసభ జరుగుతుందంటూ.. పేర్కొనడం ఏ రకంగా సబబు అంటూ.. జనసేన కార్యకర్తలు ఆయన తీరు మీద గుర్రుమంటున్నారు.
పవన్ కల్యాణ్ వామపక్షాలతో స్నేహబంధం విషయంలో చాలా అత్యుత్సాహం కనబరుస్తూ ఉండడం అనేది కొత్త సంగతి ఎంతమాత్రమూ కాదు. ఇటీవల ఆ పార్టీల నాయకులతో కలసి మీడియాను అడ్రెస్ చేసినప్పుడు.. తన కుటుంబ మూలాల్లోనే వామపక్ష భావజాలం ఉన్నదని, తన తండ్రి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడని పవన్ ప్రకటించారు. (నోట్ : అంత లెఫ్ట్ ప్రేమ ఉంటే.. గత ఎన్నికల్లో మోడీకి ఎందుకు మద్దతిచ్చినట్లు? అని ఎవరూ ప్రశ్నించరాదు). అలా ఆయన తన లెఫ్ట్ అభిమానాన్ని బయటపెట్టిన తర్వాత.. ఎవరైనా సరే.. ఈ పార్టీలు జట్టు కడుతున్నాయేమో అనే అనుకుంటున్నారు.
నిజానికి అంతో ఇంతో క్షేత్రస్థాయిలో కేడర్ సపోర్ట్ ఉన్న వామపక్షాలతో జట్టుకట్టి కూటమి కావాలనే ఆలోచన పవన్ కల్యాణ్ కు కూడా ఉన్నది కానీ.. ఆ విషయాన్ని ముందుగా రామకృష్ణ ప్రకటించేయడమే ఆ పార్టీ వారికి కంటగింపుగా ఉంది. తమ ప్రమేయం లేకుండా.. ఇలాంటి ప్రకటనలు చేయకుండా వామపక్షాలను కట్టడి చేయాలని వారు అనుకుంటున్నారట. మరి అసలే పోరాటాలకు అలవాటు పడిన లెఫ్ట్ పార్టీలు ఇలాంటి అణచివేతలకు లొంగుతాయా అనేది వేచిచూడాలి.