Begin typing your search above and press return to search.

హతవిధీ.. పవన్ ఏంటిది.?

By:  Tupaki Desk   |   12 April 2019 6:52 AM GMT
హతవిధీ.. పవన్ ఏంటిది.?
X
ఎన్నో కలలు.. ఎన్నో ఊహాలు.. ఏపీ రాజకీయ అరంగేట్రంతో జనసేనను జనంలోకి చొప్పించాలని చేసిన ప్రయత్నం ఏమై ఉంటుంది.. బలమైన టీడీపీ, వైసీపీలను ఢీకొని ఏపీ రాజకీయాలపై తనదైన ముద్రను వేయాలని రేయనక..పగలనక పోరాడిన పవన్ కు ఏమేరకు ఫలితం వస్తుంది.? ఇప్పుడిదే ప్రశ్న జనసైనికులనే కాదు.. జనసేనానిని కూడా తొలుస్తోంది.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ నిన్న పోలింగ్ ముగిశాక విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో నేలపైనే కూర్చొని ధీర్ఘాలోచనలో మునిగిపోయారు. మూడు నాలుగు నెలలుగా ప్రజల్లో ఉండి.. ప్రచారం చేసి అలసిసొలసిన పవన్.. తన రాజకీయ భవిష్యత్ మొత్తం ఈవీఎంలలో నిక్షిప్తమైన వేళ ఓటరు నాడి ఎలా ఉండబోతుందనే దానిపై సమాలోచనలో పడిపోయారు.

జనసేన పార్టీ కార్యాలయంలో అతి సామాన్యుడిగా ఫ్లోర్ పై కూర్చొని పవన్ ఆలోచిస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. జనసేన కార్యాలయం బయట ఇటుక పెల్లలపై కూడా పవన్ జనసేన జెండా ముందు నిలబడి ఆలోచిస్తున్నట్టు ఫొటోలను విడుదల చేశారు..

ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్ర కోసం పరితపిస్తున్న పవన్.. ఈ ఎన్నికల ఓటింగ్ సరళి చూశాక మాత్రం డీలా పడ్డట్టు సమాచారం. ఎక్కువగా వైసీపీ - టీడీపీ మధ్యే పోరుసాగినట్లు స్పష్టమవ్వడం.. జనసేన ప్రభావం అంతగా ఉండదని విశ్లేషణలు రావడంతో ఇలా ఆలోచనల్లో మునిగిపోయారా అన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే పవన్ పోరాట పటిమ మాత్రం ఈ ఎన్నికల్లో జనసైనికులకు స్ఫూర్తినిచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి జనసేన విజయమో.. పరాజయమో ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది.