Begin typing your search above and press return to search.

షాకింగ్ గా ప‌వ‌న్ అప్పుల లెక్క‌లు!

By:  Tupaki Desk   |   22 March 2019 5:16 AM GMT
షాకింగ్ గా ప‌వ‌న్ అప్పుల లెక్క‌లు!
X
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ వేడి రాజుకుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఫోకస్ కూడా రాజకీయాలపైనే పడింది. చాలా మంది సినీ ప్రముఖులు వైసీపీ, టీడీపీల్లో చేరుతున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే రాంగోపాల్ వర్మ కూడా ఫాలో అవుతున్నాడనానికి ఆయన చేసిన తాజా ట్వీటే నిదర్శనం.

కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి.. చంద్రబాబు చేతిలో దారుణంగా మోసపోయారు. పోయిన సారి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు ఆకర్షితుడై చంద్రబాబును నమ్మి టీడీపీలో చేరారు. ఇప్పుడు 2019 ఎన్నికల వేళ బాబు.. అవసరం తీరాక ఎస్వీ మోహన్ రెడ్డిని కాలదన్నారు. కూరలో కరివేపాకులా టికెట్ ఇవ్వనని తీసిపారేశారు. దీంతో కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఎస్వీ మోహన్ రెడ్డికి తత్వం బోధపడి తాజాగా తిరిగి వైసీపీలో చేరారు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆయన ఎటువంటి షరతులు లేకుండా వైసీపీ తీర్థం పుచ్చుకొని కర్నూలులో టీడీపీ అభ్యర్థిని ఓడిస్తానని శపథం చేశారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ హాట్ హాట్ పరిణామాల మధ్యనే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. ఈ సంఘటనను తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ కు తెలివిగా వాడేశాడు. ఇటీవలే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలోని ‘దగా దగా’ అంటూ సాగే ‘వెన్నుపోటు’ పాట విడుదల సందర్భంగా ఇదే కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి బాబుపై ప్రేమతో అందరికంటే ఎక్కువగా స్పందించారు. చంద్రబాబు ప్రతిష్టను వర్మ కించపరుస్తున్నాడని వర్మపై కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టించారు.

ఆ సందర్భాన్ని వర్మ గుర్తు చేసుకొని ఒక ఆసక్తికరమైన ట్వీట్ ను చేశారు. ‘వెన్నుపోటు పాటను నిరసించిన చంద్రబాబు వీరవిధేయుడు.. ఇప్పుడు ఆ చంద్రబాబుకే వెన్నుపొటు పొడిచి వైసీపీలో చేరారు. ఇది నిజం.. నమ్మండి’ అంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ఇలా నమ్మిన వాళ్లను బాబు నట్టేట ముంచి తన పాటకు న్యాయం చేశారని ట్వీట్ ద్వారా వర్మ వేసిన కౌంటర్ వైరల్ గా మారింది.

నా ద‌గ్గ‌ర ఆస్తులు ఏమీ లేవు.. ఉన్న‌వి కొన్ని అమ్మేశానంటూ అప్పుడ‌ప్పుడు త‌న ఆర్థిక విష‌యాల గురించి మాట్లాడుతుంటారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఏ మాట‌కు ఆ మాట చెప్పాలి.. ప్ర‌ముఖులు ఎవ‌రైనా ఆర్థికంగా స్థిర‌ప‌డి..కోట్లాది రూపాయిలు వెన‌కేసుకున్న త‌ర్వాతే సేవ గురించి మాట్లాడ‌తారు. కానీ.. ప‌వ‌న్ అందుకు భిన్నం. డ‌బ్బులు లేకున్నా.. డ‌బ్బులు వ‌చ్చే మార్గం ఉన్న‌ప్ప‌టికీ వాటిని వ‌దిలేసి ప్ర‌జాసేవ కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్లు చెబుతుంటారు. ఇది నిజ‌మేన‌ని.. ఆయ‌న మాట‌ల్లో వాస్త‌వం ఉంద‌న్న విష‌యం తాజాగా ఆయ‌న దాఖ‌లు చేసిన ఎన్నిక‌ల అఫిడ‌విట్ చెప్ప‌క‌నే చెబుతుందంటున్నారు.

చేతిలో డ‌బ్బులు ఉంటే చాలు.. సాయం కోసం వ‌చ్చిన వారికి కాద‌న‌కుండా డ‌బ్బులు ఇచ్చేసే త‌త్త్వం ప‌వ‌న్ సొంతంగా ప‌లువురు చెబుతుంటారు.ఇండ‌స్ట్రీలోనూ ప‌వ‌న్ ఆప‌న్న‌హ‌స్తం గురించి గొప్ప‌గా చెప్పుకోవ‌టం చూసింది. తాజాగా జ‌న‌సేన అధినేత హోదాలో.. విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న‌ ఆయ‌న గురువారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా త‌న ఆస్తులు.. అప్పుల గురించిన అఫిడ‌విట్ నామినేష‌న్ కు జ‌త చేర్చారు. అయితే.. ఇందులోని విష‌యాలు అధికారికంగా విడుద‌ల కాలేదు కానీ.. అన‌ధికారికంగా సోష‌ల్ మీడియాలో బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇందులో నిజం పాళ్లు ఎంత‌న్న సందేహం ఉన్న‌ప్ప‌టికి.. దాదాపుగా వాస్త‌వాలే బ‌య‌ట‌కు వ‌చ్చి ఉంటాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ప‌వ‌న్ దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ లో ఆస్తుల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. అప్పుడు భారీగా ఉన్న విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని చెబుతున్నారు. త‌న వ‌దిన సురేఖ వ‌ద్ద కూడా ప‌వ‌న్ అప్పు తీసుకున్న వైనం అఫిడ‌విట్ లో క‌నిపిస్తుంద‌ని చెబుతున్నారు. ప‌లువురు నిర్మాత‌ల‌కు సైతం ఆయ‌న డ‌బ్బు బాకీ ప‌డ్డ‌ట్లు అఫిడ‌విట్ లో పేర్కొన్న వివ‌రాలు చెప్ప‌క‌నే చెప్పేస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఇదంతా చూసిన‌ప్పుడు ఇన్ని అప్పులు పెట్టుకొని ప్ర‌జాసేవ కోసం రాజ‌కీయాల్లోకి ప‌వ‌న్ రావ‌టం షాకింగ్ గా మారింది. స్నేహితులు.. బంధువులు.. నిర్మాత‌లకు తిరిగి చెల్లించాల్సిన అప్పులు భారీగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఆఫిడ‌విట్ లో ప‌వ‌న్ పేర్కొన్న ప్ర‌కారం చ‌రాస్తులు రూ.12 కోట్లు కాగా.. స్థిరాస్తుల విలువ రూ.40 కోట్లుగా చెబుతున్నారు. మొత్తం రూ.52 కోట్ల ఆస్తుల‌కు.. రూ.33 కోట్ల అప్పులు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇక‌.. ప‌వ‌న్ స‌తీమ‌ణి అన్నా లెజినోవా పేరుతో చ‌రాస్తులు రూ.30 లక్ష‌లు.. స్థిరాస్తులు రూ.40లక్ష‌లు ఉన్న‌ట్లుగా వెల్ల‌డించారు. పిల్ల‌ల పేరు మీద మాత్రం రూ.2.92 కోట్ల ఆస్తులు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ప‌వ‌న్ అప్పుల లెక్క‌ను చూస్తే..

= త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రూ.2.40 కోట్లు

= హారిక హాసిని రూ.1.25కోట్లు

= కె సురేఖ రూ.1.07కోట్లు

= ఎం. ప్ర‌వీణ్ కుమార్ రూ.3కోట్లు

= ఎంవీఆర్ ఎస్ ప్ర‌సాద్ రూ.2కోట్లు

= శ్రీ‌బాలాజీ సిని చిత్ర మీడియా రూ.2కోట్లు

= శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ రూ.27కోట్లు

= వై న‌వీన్ కుమార్ రూ.5.50 కోట్లు

తిరిగి చెల్లించాల్సిన‌ రుణాలు : రూ.33కోట్లు