Begin typing your search above and press return to search.
ప్రజారాజ్యంతో సంబంధం లేదనేసిన పవన్
By: Tupaki Desk | 25 Nov 2018 9:12 AM GMTమెగా స్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కీలక నేత. ఆ పార్టీలో యువజన శాఖకు ఆయనే అధినేత. పార్టీ పెట్టిన మొదట్లో.. ఎన్నికల వరకు పవన్ చాలా చురుగ్గా ఉన్నాడు. చాలా ఉద్రేకంతో ప్రసంగాలు చేశాడు. కార్యకర్తల్లో ఉత్సాహం తెచ్చాడు. ఐతే ఎన్నికల తర్వాత పవన్ పాత్ర పరిమితం అయిపోయింది. ఒక దశ దాటాక పార్టీకి పూర్తిగా దూరం అయిపోయాడు. ఐతే ఇప్పుడు పవన్ సొంతంగా జనసేన పార్టీ పెట్టిన నేపథ్యంలో దానికి ప్రజారాజ్యం పార్టీకి ముడి పెడుతూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఎంత కాదన్నా చిరంజీవి.. పవన్ కు అన్నయ్య. ఆయన పార్టీలో పవన్ కూడా కీలకంగా వ్యవహరించాడు. దీంతో ఆ పార్టీ వైఫల్యాన్ని పవన్ కు కూడా ముడి పెడుతున్నారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం.. చిరంజీవి కాంగ్రెస్ నేతగా కొనసాగడాన్ని గుర్తు చేసి పవన్ ను దెప్పి పొడుస్తున్నారు. ఐతే పవన్ మాత్రం ప్రజారాజ్యంలో ఒక దశ దాటాక చోటు చేసుకున్న పరిణామాలకు తాను ఎంతమాత్రం బాధ్యత వహించనంటున్నాడు. వాటితో తనకేమీ సంబంధం లేదంటున్నాడు. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంలో తన పాత్ర ఏమీ లేదంటున్నాడు. కొందరు తనను ఈ విషయమై విమర్శిస్తున్నారని.. ఐతే ఆ విలీనం జరిగినపుడు తనది ప్రేక్షక పాత్రే అని పవన్ స్పష్టం చేశాడు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీతో తనకే సంబంధం లేదన్నాడు. ఇక జనసేన విషయానికి వస్తే.. భవిష్యత్తులో ఎప్పుడూ తాను ఏ పార్టీలోనూ జనసేనను విలీనం చేయనని తేల్చి చెప్పాడు. రంపచోడవరంలో అడవి బిడ్డల అవస్థల గురించి తెలుసుకునేందుకు యాత్ర చేపట్టిన పవన్.. అక్కడ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.