Begin typing your search above and press return to search.

'క్లాస్ వార్' మాట పై నిప్పులు చెరిగిన పవన్

By:  Tupaki Desk   |   1 July 2023 10:06 AM GMT
క్లాస్ వార్ మాట పై నిప్పులు చెరిగిన పవన్
X
ఇటీవల కాలం లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి తరచూ వస్తున్న క్లాస్ వార్ మీద తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి నోటి నుంచి ఆ మాట రావటాన్ని తీవ్రంగా తప్పుపట్టిన పవన్.. ఆ మాట అనాల్సింది తాము తప్పించి ముఖ్యమంత్రి అనకూడదన్నారు. భీమవరం లో నిర్వహించిన భారీ రోడ్ షోలో భాగంగా ప్రసంగించిన పవన్.. క్లాస్ వార్ మీద కాస్త ఎక్కువసేపు మాట్లడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు.

"ఒకే కులాని కి చెందిన వారికి 142 పోస్టులు కట్టబెట్టింది కాక క్లాస్ వార్ గురించి మాట్లాడతారా? మద్యపానం నిషేధిస్తామన్నారు.. జరగలేదు. గంగవరం నిర్వాసితుల కు ఇస్తామన్న పరిహారం నేటికి ఇవ్వలేదు. రాష్ట్రంలో ఇసుక ర్యాంపుల ను మూడు కంపెనీ లకు కట్టబెట్టారు. అలాంటి మీరా క్లాస్ వార్ గురించి మాట్లాడేది. సిగ్గుచేటు" అంటూ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డారు. ఈ సందర్భంగా క్లాస్ వార్ అంటే ఏమిటో అర్థం చెప్పిన పవన్ కల్యాన్.

"క్లాస్ వార్ అంటే డబ్బులున్న వారు పేదల ను దోచుకోవటం. అలాంటి వారి చేతి లో పేదలు నలిగిపోవటం. ఈ విషయాలు మాట్లాడుతుంటే మీరేమో క్లాస్ వార్ వదిలేసి క్యాస్ట్ వార్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి గా వచ్చిన మొదటి నెలలోనే 33 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. 32 మంది చావుకు కారణం అయ్యారు. ఇసుక ర్యాంపుల్నిమూడు కంపెనీల కు కట్టబెట్టి 50 వేల మంది పొట్ట కొట్టారు. అన్ని పదవుల ను ఒకే కులానికి కట్టబెడితే క్లాస్ వార్ అంటారా? క్యాస్ట్ వార్ అంటారా?" అంటూ ప్రశ్నించారు.

పవన్ చేసిన సీరియస్ వ్యాఖ్యల్లో ముఖ్యమైనవి చూస్తే..

- యువజన శ్రామిక రైతు అంటూనే రైతుల కు అన్యాయం చేస్తున్న మీరు.. మీ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పేరు లో ఉన్న రైతు పదం తీసేయాలి.

- ఇసుక టన్నుకు రూ.4 వేల జెట్యాక్స్‌ తాడేపల్లికి కట్టాల్సి వస్తోందని, ఇది నిజం కాదా?

- చిన్నప్పుడే జగన్‌ పోలీసుల ను కొట్టాడు. ఎస్‌ఐ ప్రకాశ్‌బాబు ను ఎలా కొట్టారో అందరికీ తెలుసు. గంజాయి ని రాష్ట్రవ్యాప్తం చేశారు. సీఎం అమ్మఒడి అమ్మఒడి.. అంటూ మాట్లాడతారు. ఇదేదో ఆయన సొంత డబ్బు ఇస్తున్నట్లు!

- గతం లో మా జనసైనికు లు బళ్లకు సైలెన్సర్లతో ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని కొందరు చెప్పారు. అయితే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే మీరే మీ నోళ్లకు సైలెన్సర్లు బిగించుకుంటే మంచిది.

- శ్రీవాణి ట్రస్టు గురించి మాట్లాడుతున్నానని కొంత మంది నన్ను విమర్శిస్తున్నారు. దర్శనానికి రూ.10 వేలు కడితే రూ.500కి బిల్లులు వస్తున్నాయి. ఆలయానికి సంబంధించిన పనులు మూడు కంపెనీల కు ఇచ్చారు. అవి ఎవరివో చెబుతారా? టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి అంటే నాకు ఎంతో గౌరవం. కానీ భగవంతుడి డబ్బుతో ఆటలాడవద్దు. తరాలు లేచిపోతాయి.