Begin typing your search above and press return to search.
పవన్ రెండు... లోకేష్ కూడా రెండేనా...?
By: Tupaki Desk | 12 Jun 2023 6:00 AM GMTఏపీలో రాజకీయం రంజుగా సాగుతోంది. ఏ నాయకుడు ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నాడు అన్న దాని మీద ఇపుడు పెద్ద చర్చ సాగుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారు అన్నది హాట్ టాపిక్ గా ఉంది. ఆయన వారాహి రధమెక్కి ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాలలో టూర్ చేయనున్నారు. ఈ సందర్భంగా పవన్ తాను పోటీ చేయబోయే సీటు గురించి కీలకమైన ప్రకటన చేస్తారు అని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి అంటే పిఠాపురం పేరు ముందు వినిపిస్తోంది. ఆ తరువాత కాకినాడ రూరల్ అంటున్నారు. అదే వరసలో భీమవరం, గాజువాక అని కూడా చెబుతున్నారు. ఇపుడు అయితే ప్రత్తిపాడు పేరుని చెబుతున్నారు. మరి పవన్ పోటీ చేసే సీటు ఏంటి అన్నది ఈ టూర్ లో కన్ ఫర్మ్ గా ఆయన నోటి వెంట చెబుతారు అని తెలుస్తోంది.
మరో వైపు చూస్తూంటే పవన్ ఈసారి కూడా రెండు సీట్ల నుంచి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఆ రెండవ సీటు పక్కాగా రాయలసీమ నుంచి ఉంటుందని అంటున్నారు. అది తిరుపతి అని కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. అంటే గోదావరి జిల్లాలో ఒక సీటు తీసుకుని మరో సీటుని రాయలసీమకు ముఖద్వారంగా ఉన్న తిరుపతి నుంచి పోటీ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారని ప్రచారంలో ఉన్న మాట.
ఎన్నికల తరువాత గెలిచిన రెండు సీట్లలో ఏదో ఒక దాన్ని అప్పటి రాజకీయ ప్రాంతీయ సామాజిక పరిస్థితులను అనుసరించి రాజీనామా చేయాలని పవన్ ఆలోచించవచ్చు అంటున్నారు. గోదావరి జిల్లాలో ఎటూ జనసేనకు బలం ఉంది కాబట్టి రాయలసీమలో జనసేనను అభివృద్ధి చేసుకోవడానికి పవన్ రెండవ సీటు పోటీ అంటున్నారు. తిరుపతి నుంచి పోటీ చేస్తే సమీపంలో ఉండే జిల్లాలో ఆ ప్రభావం గట్టిగా పడుతుందని పవన్ అంచనా వేస్తున్నారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే పవన్ మాత్రమే కాదు లోకేష్ కూడా రెండవ సీటు నుంచి పోటీ చేస్తారా అన్న చర్చ వస్తోంది. లోకేష్ మంగళగిరి నుంచి పోటీకి ఎప్పటి నుంచో తయారుగా ఉన్నారు. అయితే ఈసారి ఉత్తరాంధ్రా నుంచి మరో సీటులో పోటీ చేయడానికి లోకేష్ చూడవచ్చు అన్న టాక్ ఉంది. అది విశాఖ జిల్లాలో అన్నది కూడా గట్టిగా వినిపిస్తున్న మాట. 2019 ఎన్నికల్లో భీమునిపట్నం నుంచి పోటీ చేయాలని భావించి చివరి నిమిషంలో లోకేష్ డ్రాప్ అయ్యారు.
ఈసారి మాత్రం అలా కాకుండా పక్కాగా పోటీకి లోకేష్ సిద్ధపడతారు అని అంటున్నారు. ఇలా పవన్ లోకేష్ రెండు చోట్ల పోటీకి దిగడం ద్వారా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఏ కారణం చేత అయినా ఒక చోట ఇబ్బంది అయినా రెండవ చోట కాపు కాస్తుందన్న ఆలోచన కూడా డబుల్ సీట్స్ కంటెస్ట్ లో ఉండవచ్చు అని అంటున్నారు.