Begin typing your search above and press return to search.

భీమవరం గురించి నాకేం తెలుసా? కొత్త కోణాన్ని చూపిన పవన్

By:  Tupaki Desk   |   1 July 2023 9:45 AM GMT
భీమవరం గురించి నాకేం తెలుసా? కొత్త కోణాన్ని చూపిన పవన్
X
తన ను విమర్శించే వారికి బలంగా సమాధానం ఇవ్వాల ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది. తాజాగా తాను చేపట్టిన వారాహి విజయయాత్ర భీమవరం చేరుకున్న నేపథ్యంలో.. ఆయన కు పట్టణం గురించి ఏమీ తెలీదన్న విమర్శల్ని ఎదుర్కొన్నారు. తాజాగా చేసిన ప్రసంగం లో తన పై వస్తున్న విమర్శల్ని తానే ప్రస్తావిస్తూ.. అలాంటి వారందరికి సరైన సమాధానం ఇచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారు.

భీమవరం గురించి తనకేం తెలుసని కొందరు మాట్లాడుతున్నారని.. ఇప్పటివరకు ఏ నాయకుడు వెళ్లని భీమవరం డంపింగ్ యార్డును స్వయంగా పరిశీలించానని చెప్పారు. తన పై ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులు పట్టణం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించలేకపోయారన్నారు. భీమవరం నుంచి వంద పడకల ఆసుపత్రికి నాబార్డు నుంచి రూ10 కోట్లు నిధులు విడుదలై ఉన్నా.. వాటిని సరిగా వినియోగించుకోలేదన్నారు.

"జగనన్న ఇళ్ల కాలనీల కు 80 ఎకరాల స్థలం తీసుకొని.. ప్రతి ఎకరా లోనూ రూ.20 లక్షలు మిగిలించుకున్నారన్నారు. రూ.1400 కోట్లతో గోదావరి పైపు లైను పనులు చేస్తామని చెప్పి.. ఆ తర్వాత అతిగతి లేదు. భీమవరాని కి పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా రెండు పైవంతెనలు అవసరం. వాటిని కూడా పట్టించుకోవటం లేదు" అంటూ సమస్యల చిట్టాను విప్పారు.

అక్వా పరిశ్రమతో రాష్ట్రానికి ఆదాయం వస్తోందని.. అదే విధంగా కాలుష్య నగరంగా మారుతోందన్నారు.కాలుష్యాన్ని తగ్గిస్తూ.. ఆదాయం పెంచే మార్గాల్ని అన్వేషించాలని చాలా ఏళ్లుగా తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. తుందుర్రు ఆక్వా ఫుడ్ పార్క్ తో చుట్టుపక్కల గ్రామాలు కాలుష్యం లో చిక్కుకున్నాయన్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న విష వాయువుల ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు" అని మండిపడ్డారు. భీమవరం గురించి తనకు ఎంత తెలుసు? అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చే ప్రయత్నం పవన్ కల్యాణ్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.